Site icon HashtagU Telugu

Nayanthara : ఆ స్టార్ హీరో వలనే నయనతార.. విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమలో పడిందట..

Nayanthara Vignesh Shivan

Nayanthara Vignesh Shivan

Nayanthara : కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2022 జూన్‌ 9న ఏడడుగులు వేసి పెళ్లి జీవితాన్ని మొదలు పెట్టారు. ఆ తరువాత సరోసగి ద్వారా ఇద్దరి కవలలకు తల్లిదండ్రులు అయ్యారు. కాగా నయన్ అండ్ విఘ్నేశ్‌ అసలు ఎప్పుడు ప్రేమలో పడ్డారు..? వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఒక స్టార్ హీరో అని మీకు తెలుసా..?

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో సినిమా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’. తెలుగులో ‘నేను రౌడీనే’ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. 2015లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించగా, నయనతార హీరోయిన్ గా చేసారు. ఇక ఈ చిత్రాన్ని తమిళ్ స్టార్ హీరో ధనుష్ నిర్మించారు. ధనుష్ కి ఈ కథ చెప్పినప్పుడు హీరోయిన్ పాత్రని నయనతారకు చెప్పమని విఘ్నేశ్ కి సూచించారట.

దీంతో విఘ్నేశ్ వెళ్లి నయన్ కి కథ చెప్పారు. ఆమెకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసారు. కాగా ఈ సినిమా కథంతా హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ సమయంలో విఘ్నేశ్, నయన్ తో ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరు తెలియకుండానే ప్రేమలో పడిపోయారట. “ఆ మూవీకి నయన్ ని రిఫర్ చేసి ధనుష్ పరోక్షంగా తమ ప్రేమకు కారణమయ్యాడు” అంటూ విఘ్నేశ్ శివన్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అలా ధనుష్ వల్ల ప్రేమలో పడిన నయనతార, విఘ్నేశ్‌ శివన్‌.. ప్రస్తుతం తల్లిదండ్రులుగా పేరెంట్ హుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వారికీ ఉయిర్‌, ఉలగం అనే పేర్లను పెట్టారు. కాగా ఈ ఇద్దర్ని సరోగసీ ద్వారా పొందడం పట్ల.. అప్పటిలో పెద్ద రచ్చ జరిగింది. నయనతార పై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే తాను చట్టపరంగానే సరోగసీకి వెళ్లినట్లు నిరూపించుకొని ఆ వివాదాలు నుంచి నయనతార బయటపడ్డారు.

Also Read : The Family Star : విజయ్ ‘ఫామిలీ స్టార్’కి ఇంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయా..!