Nayanthara Casting Couch: అడిగింది చేయాలని కండిషన్ పెట్టారు.. కాస్టింగ్ కౌచ్ పై నయనతార..!

కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాల్ని బయటపెట్టారు. అయితే ఎక్కువమంది మాత్రం తమకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదంటూ గుంభనంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. అయితే నయనతార (Nayanthara) మాత్రం ఇలా సైలెంట్ గా ఉండే రకం కాదు.

Published By: HashtagU Telugu Desk
Nayanthara

Nayanthara

కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాల్ని బయటపెట్టారు. అయితే ఎక్కువమంది మాత్రం తమకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదంటూ గుంభనంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు. అయితే నయనతార (Nayanthara) మాత్రం ఇలా సైలెంట్ గా ఉండే రకం కాదు. ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని బయటపెట్టింది. కెరీర్ స్టార్టింగ్ లో ఓ భారీ సినిమా ఆఫర్ వచ్చిందట.

కాకపోతే మేకర్స్ ఓ కండిషన్ పెట్టారట. తమకు నచ్చినట్టు ఉండాలని, అడిగింది చేయాలని కండిషన్ పెట్టారట. నచ్చినట్టు ఉండడం అంటే ఏంటి.. అడిగింది చేయడం అంటే ఏంటని నయనతార అడిగిందట. షూటింగ్ లేని సమయంలో కూడా తమతో ఉండాల్సి ఉంటుందని వాళ్లు చెప్పారట. వెంటనే విషయం ఏంటనేది అర్థం చేసుకుంది నయనతార. ఆ ప్రాజెక్టును సున్నితంగా తిరస్కరించింది. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది.

Also Read: rukshar dhillon : రుక్సార్ థిల్లాన్ హాట్ లేటెస్ట్ స్టిల్స్

నిజానికి ఆ ఆఫర్ వచ్చిన టైమ్ లో నయనతార స్టార్ కాదు. అది పెద్ద సినిమా ఆఫర్ కావడంతో, గత్యంతరం లేక తను ఒప్పుకుంటానని వాళ్లు భావించారని, కానీ తనపై తనకు నమ్మకం ఉండడంతో ఆ భారీ ఆఫర్ ను తిరస్కరించానని చెప్పుకొచ్చింది నయన్. అయితే ఆ సినిమా ఏంటనేది మాత్రం ఆమె బయటపెట్టలేదు.

  Last Updated: 05 Feb 2023, 11:18 AM IST