తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రతిభకు కంటే డబ్బులే ముఖ్యం అన్న వాదన తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. టాలెంట్, నటన, డ్యాన్స్ లేకపోయినా పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే హీరో అవ్వచ్చని ఇప్పటికే కొంతమంది నిరూపించారు. అందులో శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ (Saravanan ) ఒకరు. 2022లో ఆయన నిర్మించి నటించిన ‘ది లెజెండ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ, ఆయన తాను పెట్టుకున్న పేరు ‘ది లెజెండ్’ను ముందుకు పెట్టుకుని మళ్లీ రెండో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదటి చిత్రంలో ఊర్వశి రౌతేలాను హీరోయిన్‌గా తీసుకొచ్చిన శరవణన్, ఇప్పుడు తన రెండో సినిమాకు కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారను ఎంపిక చేయాలనీ అనుకున్నాడు.
Vemulawada : రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి..భక్తులు ఆగ్రహం
శరవణన్ తన రెండో సినిమాను మరో హై బడ్జెట్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దాలని చూస్తున్నారట. అందులో భాగంగా నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలన్న ఆలోచనతో ఆమె టీమ్‌తో సంప్రదింపులు కూడా జరిగాయని సమాచారం. ఆమె ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని, ఇంతకీ రూ.100 కోట్ల వరకూ రెడీ అని వార్తలు చెబుతున్నాయి. అయితే నయనతార (Nayanatara) మాత్రం “ఎంత ఇచ్చినా సరే శరవణన్ సినిమాల్లో నటించను” అని చెప్పినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అయితే ఇది నిజంగా జరిగినదేనా, లేక సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న పుకారేనా అన్నదానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు.
Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు
ప్రస్తుతం నయనతార అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇది ఆమె తెలుగులో చేస్తున్న భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె రూ.18 కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా నయనతార సినిమాల ప్రమోషన్లకు హాజరయ్యేది కాదు. కానీ ఈసారి దర్శకుడు ఒప్పించి, నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్ మంజూరు చేయడంతో ఆమె తన నిబంధనలను తొలగించి ప్రమోషన్లలో పాల్గొంటోంది. తమిళ్, మలయాళ సినిమాల్లో రూ.2-4 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకునే నయన్, తెలుగులో మాత్రం మూడింతల రెమ్యూనరేషన్ తీసుకుంటుండడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.