Site icon HashtagU Telugu

Nayanthara: నయన్ సంచలన నిర్ణయం.. జవాన్ తర్వాత సినిమాలకు గుడ్ బై?

Nayanatara

Nayanatara

ప్రముఖ సౌత్ నటి నయనతార (Nayanthara)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పెళ్లయినా కూడా ఈ బ్యూటీకి ఫుల్ డిమాండ్ ఉంది. అయితే షారుఖ్ ఖాన్ సరసన జవాన్‌ (Jawan)లో నటించింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సౌత్ నటీమణులలో ఒకరు.  నయనతారకు భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో తాను ఒకరు. ఆమె అభిమానులు ఆమెను సూపర్ స్టార్ కింగ్ ఖాన్  షారూక్ ఖాన్ సరసన చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. అయితే జవాన్ తర్వాత నయన్ (Nayanthara) నటన నుండి విరామం తీసుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నయనతార తన కవలలపై దృష్టి పెట్టడానికి, వారి బాగోగులు చూసుకోవడానికి నటనను గుడ్ బై చెప్పాలని యోచిస్తోంది. ఆమె తన భర్తతో కలిసి ఉంటుందని, వారి ప్రొడక్షన్ హౌస్‌ని విజయవంతం చేయడానికి అతనికి సహాయం చేస్తుందని కూడా సమాచారం. నయనతార సినీ నిర్మాత విఘ్నేష్ శివన్‌ను వివాహం (Marriage) చేసుకుంది. ఈ జంటకు ఉయిర్, ఉలగం అనే కవల కుమారులు ఉన్నారు.

నయనతార ప్రస్తుతం వివిధ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఆమె ఈ ప్రాజెక్టులను అన్నింటినీ నిలిపివేస్తుందా లేదా అన్ని పూర్తయిన తర్వాత విరామం తీసుకుంటుందా అనేది కూడా స్పష్టంగా లేదు. అయితే, నయనతార (Nayanthara) తాను విరామం తీసుకోబోతున్నట్లు అధికారికంగా ధృవీకరించలేదు. కానీ కొంతకాలం గ్యాప్ తీసుకుకోవచ్చు? లేదంటూ సినిమాలకు పర్మినెంట్ గా గుడ్ బై కూడా చెప్పవచ్చునని సన్నిహితులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక నయనతార చివరిగా గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి సరసన నటించింది. జవాన్‌తో పాటు, సూపర్‌స్టార్ 75, పట్టు, ఎకె 62 ఉన్నాయి. పూరి జగన్నాధ్ ఆటో జానీకి కూడా ఆమె సంతకం చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Lokesh Calls Jr.NTR: టీడీపీ సంచలనం.. జూనియర్ NTRకు లోకేష్ పిలుపు!