Nayanthara : తమిళనాడులో సూపర్ స్టార్ వివాదం.. నయనతార ఏమందంటే?

గత కొన్నాళ్లుగా ఈ సూపర్ స్టార్ టైటిల్ వివాదం తమిళ్ లో నడుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Nayanthara Comments on Super Star Title Issue in Tamilnadu

Nayanthara Comments on Super Star Title Issue in Tamilnadu

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) అని అందరికి తెలిసిందే. తమిళ్ లోనే కాదు బయట సినీ పరిశ్రమలలో కూడా రజినీకాంత్ ని సూపర్ స్టార్(Super Star) అనే పిలుస్తారు. అయన స్టైల్, నటన మెచ్చి ఎప్పట్నుంచో అభిమానులు సూపర్ స్టార్ అని పిలుచుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా రజినీకాంత్ సినిమాలకు ఆయన పేరు ముందు సూపర్ స్టార్ టైటిల్ కార్డు పడుతుంది.

అయితే గత కొన్నాళ్లుగా ఈ సూపర్ స్టార్ టైటిల్ వివాదం తమిళ్ లో నడుస్తుంది. పలువురు తమిళ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు తమ హీరోకి సూపర్ స్టార్ టైటిల్ ఇవ్వాలని, రజినీకాంత్ పని అయిపోయిందని, విజయ్ ప్రస్తుతం సూపర్ స్టార్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనిపై రజిని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరో వైపు నయనతారకు(Nayanthara) లేడీ సూపర్ స్టార్ అని టైటిల్ కార్డు వేస్తున్నారు.

సౌత్ లో నయనతార కమర్షియల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వరుస పెట్టి చేస్తుంది. గత కొన్నాళ్ల నుంచి పలు నయనతార సినిమాలకు లేడీ సూపర్ స్టార్ అని టైటిల్ వేస్తున్నారు. ఇటీవల అన్నపురాణి అనే సినిమాతో నయనతార ప్రేక్షకుల ముందుకి రాగా ఈ సినిమాలో కూడా నయనతారకు లేడీ సూపర్ స్టార్ అని టైటిల్ వేశారు. ఇప్పుడు ఇది కూడా వివాదంగా మారింది.

పలువురు రజిని అభిమానులు సూపర్ స్టార్ టైటిల్ కేవలం రజినీకాంత్ కోసమే, ఇంకెవరూ ఆ టైటిల్ వాడకూడదు అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నయనతార లేడీ సూపర్ స్టార్ అని వేసుకున్నందుకు, ఆమెపై, చిత్రయూనిట్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ సూపర్ స్టార్ వివాదంపై నయనతార స్పందించింది.

Also Read : Hollywood – 100 Years : హాలీవుడ్ సైన్ బోర్డ్ 100వ బర్త్ డే.. ఎంత చరిత్ర ఉందంటే ?

నయనతార తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను లేడీ సూపర్ స్టార్ వేయమని అడగలేదు. నేను నయనతార అని మాత్రమే వేయమన్నాను. కానీ మా డైరెక్టర్ వినకుండా లేడీ సూపర్ స్టార్ అని టైటిల్ వేశారు. దానికి 10 మంది తిడితే, 50 మంది పొగుడుతున్నారు. అసలు నాకు అలాంటి టైటిల్స్ నచ్చవు, వేయొద్దు అనే చెపుతాను అని తెలిపింది. మరి దీనిపై రజిని అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

  Last Updated: 10 Dec 2023, 03:18 PM IST