Nayanthara : సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార రెండేళ్ల క్రితం డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఈ జంట పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సరోగసి ద్వారా కవల పిల్లలను కూడా కన్నారు. ప్రస్తుతం నయన్, విగ్నేష్ ఇద్దరూ కూడా తమ సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.
నిన్న విగ్నేష్ శివన్ పుట్టిన రోజు కావడంతో నయనతార, విగ్నేష్ సెలబ్రేషన్స్ కి దుబాయ్ వెళ్లారు. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా ముందు నయనతార విగ్నేష్ శివన్ పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసింది. నిన్నే దుబాయ్ లో భర్తతో ఓ రెస్టారెంట్ లో దిగిన ఫోటోలు షేర్ చేసి స్పెషల్ విషెస్ చెప్పింది నయనతార.
అయితే బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నయన్, విగ్నేష్ సన్నిహితులు కూడా పాల్గొన్నారు. వారిలో ఒకరు దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారయింది. ఫ్యాన్స్, నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Devara Interview : సిద్ధూ, విశ్వక్ లతో ఎన్టీఆర్ దేవర స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో వచ్చేసింది.. ఫుల్ కామెడీ..