Site icon HashtagU Telugu

Nayanatara : భర్త విఘ్నేష్ ని అన్ ఫాలో చేసిన నయన్.. ఏం జరిగిందంటూ ఫ్యాన్స్ లో కంగారు..!

Nayanatara Un Follow Vighnesh Sivan What Happening

Nayanatara Un Follow Vighnesh Sivan What Happening

Nayanatara కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ విడిపోతున్నారా.. నయనతార ఎందుకు ఆమె భర్తని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. ఇద్దరు విడిపోతున్నారా.. ఇలాంటి డౌట్లే కోలీవుడ్ ఆడియన్స్ లో మొదలయ్యాయి. విఘ్నేష్ శివన్ ని అన్ ఫాలో చేసిన నయన్ స్టేటస్ లో షీ ఈజ్ గొన్నా ఫరెవర్ సే ఐ గాట్ దిస్ ఈవెన్ విత్ టియర్స్ ఇన్ హర్ ఐస్ అంటూ మెసేజ్ పెట్టింది.

అంటే ఆమె కన్నీళ్లతో కూడా నాకు ఇది వచ్చిందని ఆమె ఎప్పటికీ చెబుతుంది అని అర్ధం వచ్చేలా స్టేటస్ లో కొటేషన్ పెట్టింది. ఈమధ్యనే వాలెంటైన్స్ డే నాడు భర్తతో క్లోజ్ గా ఫోటోస్ షేర్ చేసిన నయన్ ఇంతలోనే ఇలా మెసేజ్ పెట్టి అతన్ని అన్ ఫాలో చేయడంపై భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ఇంతకీ విఘ్నేష్ శివన్ తో నయనతార గొడవ ఏంటి. అతన్ని ఎందుకు నయన్ అన్ ఫాలో చేసింది. అది కావాలని జరిగిందా లేక ఏదైనా మిస్టేక్ వల్ల జరిగిందా అసలేం జరుగుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే నయనతార విఘ్నేష్ ఈ ఇద్దరు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.