కోలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నయనతారకు తమిళంలో అవకాశాలు కొంత తగ్గినప్పటికీ, టాలీవుడ్‌లో మాత్రం ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో చేసిన సైరా, గాడ్ ఫాదర్ చిత్రాల తర్వాత ప్రస్తుతం శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తుంది. తాజాగా ‘మీసాల పిల్ల’ పాటకు వచ్చిన అద్భుత స్పందన నయన్‌కో మరోసారి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న అపార ఆదరణను రుజువు చేస్తోంది.
Settipally Ramasundhar Reddy : ఏపీ కలెక్టర్ గొప్ప మనసు.. ఉచితంగా ఎకరం స్థలం.!
ఇదిలా ఉండగానే నయనతార మరో భారీ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకున్నట్టుగా ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీరసింహారెడ్డి విజయాన్ని రిపీట్ చేయడానికి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో సిద్ధమవుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నయన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యిందని సమాచారం. నవంబర్ 7న పూజా కార్యక్రమాలు నిర్వహించి, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బాలయ్య తో శ్రీరామ రాజ్యం, సింహ*, జైసింహ వంటి చిత్రాల్లో నయన్ జోడి కట్టింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది.
