అదేంటో ఈసారి మన మేకర్స్ దసరాని తమిళ సినిమాలకు ఇచ్చేసినట్టు ఉన్నారు. అందుకే సెప్టెంబర్ 27న దేవర తర్వాత మళ్లీ అక్టోబర్ 30కి సినిమాలు రిలీజ్ పెట్టుకున్నారు కానీ దసరాకి ఏ సినిమా రిలీజ్ షెడ్యూల్ చేయలేదు. దసరాకి కోలీవుడ్ హీరో సూర్య కంగువ, సూపర్ స్టార్ రజినికాంత్ వేటయ్య రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య తమిళ బాక్సాఫీస్ దగ్గరే కాదు తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా ఫైట్ జరగనుంది.
ఐతే ఈ సినిమాల మధ్యలో ఏ తెలుగు సినిమా రిలీజ్ చేయట్లేదా అని మన ఆడియన్స్ డౌట్ పడ్డారు. కానీ దసరా రేసులో నేనున్నా అంటూ ఒకే ఒక్కడు వస్తున్నాడు. ఈమధ్యనే హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు. ఆ సినిమాతో నవ దళపతి స్క్రీన్ నేం తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం మా నాన్న సూపర్ హీరో (Ma Nanna Super Hero) సినిమా చేస్తున్న సుధీర్ బాబు ఆ సినిమాను దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాను అభిలాష్ డైరెక్ట్ చేశారు. ఇదివరకు అతను లూసర్ అనే వెబ్ సీరీస్ డైరెక్ట్ చేశారు. కచ్చితంగా మా నాన్న హీరో సినిమా సుధీర్ బాబు (Sudheer Babu)కి మంచి సక్సెస్ ఇచ్చేలా ఉంది. ఐతే ఇప్పటివరకు దసరాకి ఏ సినిమా రిలీజ్ అనౌన్స్ చేయలేదు. కేవలం రెండు తమిళ సినిమాలే వస్తున్నాయి. సో సుధీర్ బాబు సినిమా కాస్త బాగున్నా కచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఓ పక్క సూర్య కంగువ (Kanguva) కూడా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రజిని వేటయ్య కూడా మంచి అంచనాలతోనే వస్తుంది. మరి ఈ రెండు సినిమాల మధ్య సుధీర్ బాబు సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.
Also Read : BiggBoss 8 : బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా ఎవరంటే..?