Saripoda Sanivaram Theatrical Rights న్యాచురల్ స్టార్ నాని డిసెంబర్ లో హాయ్ నాన్న సినిమాతో వచ్చారు. నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన హాయ్ నాన్న సూపర్ హిట్ అందుకుంది. సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా సినిమా హిట్ లో బాధ్యత వహించింది. హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. దసరా హాయ్ నాన్న రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో నాని సూపర్ ఫాం లో ఉన్నాడు.
We’re now on WhatsApp : Click to Join
ఇక ఈ సినిమా తర్వాత నాని (Nani) వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం (Saripoda Sanivaram) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. సరిపోదా శనివారం సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. సినిమాలో నాని క్యారెక్టరైజేషన్ స్పెషల్ గా ఉంటుందని టాక్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు (Dil Raju) కొనేశారని తెలుస్తుంది. నాని సరిపోదా శనివార థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు భారీ మొత్తానికి కొనేశారట. నాని సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే దిల్ రాజు సరిపోదా శనివారం సినిమాకు మేకర్స్ డిమాండ్ చేసినంత ఇచ్చి సినిమా రిలీజ్ రైట్స్ దక్కించుకున్నారట.
నాని హిట్ రేషియో ఎలాగు తెలుసు కాబట్టి దిల్ రాజు అందుకు తగినట్టుగానే ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది. దసరా, హాయ్ నాన్న రెండు డిఫరెంట్ సినిమాలతో నాని లాస్ట్ ఇయర్ సూపర్ హిట్లు అందుకున్నారు. ఈసారి సరిపోదా శనివారం సినిమా కూడా అదే రేంజ్ లో రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాని హిట్ 3 సినిమా చేయాల్సి ఉంది. అంతేకాదు త్రివిక్రం తో సినిమా చర్చల్లో ఉందని టాక్.
Also Read : Guntur Karam OTT Release : ఓటీటీలో గుంటూరు కారం.. రమణగాడు డిజిటల్ స్ట్రీమింగ్ ఎందులో అంటే..!
ఏది ఏమైనా నాని ఈమధ్య తన సినిమాలతో తను హిట్ కొడుతూ పరిశ్రమకు ఎంతోకొంత సపోర్ట్ గా నిలుస్తున్నాడు. తప్పకుండా నాని రాబోతున్న సినిమాలు కూడా అంచనాలకు తగినట్టుగానే ఉంటాయని చెప్పొచ్చు. నాని సరిపోదా శనివారం మాత్రం సినిమా మొదలు పెట్టినప్పుడు రిలీజ్ చేసిన గ్లింప్స్ తోనే అంచనాలు పెరిగాయి. నాని చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏమేరకు సక్సెస్ అందుకుంటాయన్నది చూడాలి. దిల్ రాజు థియేట్రికల్ రైట్స్ కొన్నారంటేనే ఆ సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుంది అన్నది అర్ధం చేసుకోవచ్చు. తప్పకుండా నానికి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందిస్తుందని నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.