Natural Star Nani మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ న్యాచురల్ స్టార్ నానితో చేసిన అంటే సుందరానికీ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఓటీటీలో ఆ సినిమా చూసి వావ్ అన్న వారు ఉన్నారు కానీ సినిమా థియేట్రికల్ హిట్ అనిపించుకోలేదు. ఈ క్రమంలో వివేక్ ఆత్రేయ (Vivek Athreya)కు మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. వివేక్, నాని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి దనయ్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ రిలీజ్ చేశారు. నీకంటూ ఒకరోజు వస్తుంది అంటూ ఈ సినిమాకు టీజర్ లో సాయి కుమార్ (Sai Kumar) ఇంటెన్స్ వాయిస్ ఓవర్ ఆడియన్స్ అటెన్షన్ ని రాబట్టుకుంది. ఇక సినిమా టైటిల్ గా సరిపోదా శనివారం అంటూ రివీల్ చేశారు. ఈ సినిమా టీజర్ చూస్తే ఈసారి వివేక్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుసుతంది.
నాని దసరా సినిమా తర్వాత హాయ్ నాన్న (Hi Nanna) మరో ఎమోషనల్ మూవీతో వస్తుండగా ఆ సినిమా తర్వాత సరిపోదా శనివారం (Saripoda Sanivaram) సినిమాతో మరో మాస్ అటెంప్ట్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. విలన్ గా ఎస్.జె సూర్య ని తీసుకున్నారు.
సరిపోదా శనివారం ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. వివేక్ ఆత్రేయ కెరీర్ లో ఫస్ట్ టైం మాస్ అటెంప్ట్ చేస్తున్నాడు. సరిపోదా శనివారం సినిమా తెలుగుతో పాటు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఈ సినిమా నానికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read :Rashmika Mandanna : ఇంతకీ రష్మిక ఎవరి గర్ల్ ఫ్రెండ్..?