Site icon HashtagU Telugu

Nani Hi Nanna : హాయ్ నాన్న వరల్డ్ టెలివిజన్ టెలికాస్ట్ ఎప్పుడంటే..?

Natural Star Nani Hi Nanna World TElevision Premier Release Date Lock

Natural Star Nani Hi Nanna World TElevision Premier Release Date Lock

Nani Hi Nanna న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హాయ్ నాన్న వరల్డ్ టెలివిజన్ టెలికాస్ట్ డేట్ టైం వచ్చేసింది. నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్ డైరెక్షన్ లో తెరకెక్కిన హాయ్ నాన్న సినిమా నాని కెరీర్ లో మరో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించడం కూడా సినిమా హిట్ కి ఒక కారణమని చెప్పొచ్చు. సినిమాకు మలయాళ మూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది.

హాయ్ నాన్న థియేట్రికల్ వెర్షన్ మాత్రమే కాదు డిజిటల్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను ఆడియన్స్ తెగ చూసేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా టీవీ స్క్రీన్స్ పై రానుంది. హాయ్ నాన్న మూవీ శాటిలైట్ రైట్స్ జెమిని టీవీ దక్కించుకుంది. ఈ క్రమంలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మార్చి 17న సాయంత్రం 6:00 గంటలకు హాయ్ నాన్న వరల్డ్ టెలివిజన్ టెలికాస్ట్ అవుతుంది.

లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజైన నాని హాయ్ నాన్న సినిమా నాని ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు నాని.

Also Read : Pushpa 2 : పుష్ప స్పెషల్ ఐటమ్.. రేసులో మరో ముద్దుగుమ్మ..!