Site icon HashtagU Telugu

Rashmika Mandanna: శ్రీవల్లి షూట్స్ బిగిన్.. పుష్ప2 సెట్ నుంచి రష్మిక ఫొటో షేర్

Rashmika

Rashmika

ప్రస్తుతం బిజియెస్ట్ హీరోయిన్స్ లో రష్మిక మందన్నా ఒకరు. తన అందం, అభినయంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.  ‘పుష్ప’ సినిమాతో పుష్పరాజ్ ఎలా అయితే ఫేమస్ అయ్యాడో.. శ్రీవల్లిగా రష్మిక మందన్నా కూడా అంతే పాపులారిటీని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’ చిత్రం షూటింగ్‌ను రష్మిక మందన్న ప్రారంభించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా సెట్స్ నుండి పీక్‌ను పంచుకుంది.

సీక్వెల్‌లో శ్రీవల్లి పాత్రను ఆమె మళ్లీ పోషించనుంది. ఆమె ఒక చిత్రాన్ని షేర్ చేసి దానికి క్యాప్షన్ ఇచ్చింది. “#nightshoot” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇటీవలనే రష్మిక రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ‘యానిమల్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పుష్పతో పాటు రెయిన్‌బో, VNR సినిమాతో బిజీగా ఉంది.

కాగా రష్మిక, విజయ్ దేవరకొండకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కొద్దికాలం నుంచి విజయ్ రష్మికతో ప్రేమలో ఉన్నాని, ఒకరిపై మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, వీరిద్దరూ కలిసి అకేషన్ కోసం వెళ్లారని, రెస్టారెంట్ లో కలుసుకున్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ వాటినుంచి ఇరువైపులా ఎవరూ ఖండించలేదు. దీంతో అభిమానులంతా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Weight Lose Tips: ఈజీగా బరువు తగ్గేయొచ్చు ఇలా!