Site icon HashtagU Telugu

Drugs Case : జల్సాలకు అలవాటు పడ్డ లావణ్య.. చివరకు డ్రగ్స్ సప్లయర్ గా మారింది

Lavanya Drags

Lavanya Drags

సోమవారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన సోదాల్లో లావణ్య (Lavanya) అనే యువతీ డ్రగ్స్ (Drugs ) తో పట్టుబడింది. ఈమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఈమెను విచారిస్తుండగా సంచలన నిజాలు బయటపడుతున్నాయి. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తున్నది. మూడు నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ అప్పుడు దొరక్కుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో.. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్‌ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించాయి.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడ నుంచి ఉన్నత చదువులు కోసం హైదరాబాద్ (Hyderabad) వచ్చిన లావణ్య ..నటనపై మక్కువతో టాలీవుడ్ లో ఛాన్సుల కోసం ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మ్యూజిక్ టీచర్ గా పని చేస్తూ చిన్న సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు. లావణ్య పలు చిన్న సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినట్లు తెలిపారు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఆమె జల్సాలకు అలవాటు పడ్డట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివరించారు. నటనా రంగంలో ఉండడంతో ఒక హీరోకు పరిచయమై అతనికి లవర్ గా కూడా ఉన్నట్లు తెలిపారు. కాకపోతే అతడి పేరు బయటకు చెప్పలేదు.

గత కొంత కాలంగా ఉనిత్ రెడ్డి ద్వారా డ్రగ్స్ ని తెప్పించుకుంటుందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాశారు. మరోవైపు, లావణ్య సోషల్ మీడియా అకౌంట్ లతో పాటు వ్యక్తిగత చాట్ ని కూడా పోలీసులు పరిశీలించనున్నారు. ఆమెకు చాలామంది వీఐపీలతో పరిచయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. లావణ్యను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామని పోలీసులు వివరించారు.

Read Also : Pawan ‘OG’ : పవన్ ‘OG’ రిలీజ్ డేట్ వచ్చేసింది..?