Mad Square : నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మ్యాడ్ సినిమా హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చ్ 28న థియేటర్స్ లో రిలీజవ్వనుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మాణంలో కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో అదే ముగ్గురు హీరోలతో ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాని తెరకెక్కించారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వించింది. దీంతో ఈసారి కూడా మ్యాడ్ స్క్వేర్ సినిమా ఫుల్ గా నవ్విస్తుందని ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. ముగ్గురు హీరోలు కలిసి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వస్తే అక్కడ జరిగే హడావిడి, పెళ్ళికి ముందు బ్యాచిలర్ పార్టీ అని గోవాకి వెళ్లడం, గోవా లో ఏం జరిగింది అని కామెడీగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.