Amardeep: ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ షో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌కి ప్రధాన కారణాలలో ఒకటి అమర్ దీప్ .వెబ్ సిరీస్, సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన అమర్‌దీప్ బిగ్ బాస్లోకి ప్రవేశించారు. ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. 82 కెమెరాలు తనపై ఫోకస్ చేస్తున్నాయి అనే విషయాన్నికూడా పక్కన పెట్టి గేమ్ ఆడాడు. ప్రతి భావోద్వేగాన్ని బయటపెట్టాడు. అతనికి కోపం వచ్చినా లేదా బాధ కలిగినా వచ్చినా ఊరుకునే వాడు కాదు.
టైటిల్ గెలుస్తానని ఖాయంగా భావించిన అమర్‌దీప్‌కి 14వ వారంలో జరిగిన గొడవ తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ గొడవలో అమర్ దీప్ ప్రశాంత్ ను తోయడంతో అతను కింద పడ్డాడు. దీని వల్ల ప్రశాంత్‌పై జనం సానుభూతి చూపి అమర్‌దీప్‌పై కోపం పెంచుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అమర్‌దీప్ బయటకు వచ్చిన తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు మనందరం చూశాం. ఇతనిపై కేసు కూడా నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో తన ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయి. అమర్ ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉన్నాడని మిత్రుడు నరేష్ లోల్ల అన్నారు. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడానికి ముందు అమర్‌కి చాలా సమస్యలు ఉండేవని తెలిపాడు. కండరాల పెరుగుదల లేకపోవడంతో అమర్‌దీప్ చాలా సార్లు సహనం కోల్పోయేవాడు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో చాలా సార్లు గొడవలు జరిగాయి. ఇన్ని రోజులు బిగ్ బాస్ ప్రయాణంలో విపరీతంగా అలసిపోయిన అమర్ దీప్ కు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు.
Also Read: Telangana : త్వరలో 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ – మంత్రి సీతక్క