Nara Rohith : టీడీపీ ప్రచారంలో పవన్ డైలాగ్‌తో అదరగొట్టిన నారా రోహిత్..

టీడీపీ ప్రచారంలో నారా రోహిత్ మాట్లాడుతూ.. లాస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పి టీడీపీ, జనసేన కార్యకర్తలను ఉత్సాపరిచారు.

Published By: HashtagU Telugu Desk
Nara Rohith Said Pawan Kalyan Movie Dialogue In Tdp Campaign

Nara Rohith Said Pawan Kalyan Movie Dialogue In Tdp Campaign

Nara Rohith : ఈసారి ఏపీ ఎన్నికల్లో సినీ సెలబ్రిటీస్ సందడి కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. టీడీపీ, జనసేన పార్టీలకు మద్దతు తెలుపుతూ బుల్లితెర నుంచి వెండితెర వరకు స్టార్ కాంపెయినర్స్ అంతా ఏపీ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే నారా రోహిత్ కూడా రంగంలోకి దిగారు. టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్యకు మద్దతు తెలుపుతూ.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలంలో హీరో నారా రోహిత్ ప్రచారం చేసారు. రోహిత్ తో పాటు ప్రముఖ కమెడియన్ రఘు కూడా పాల్గొన్నారు.

ఇక ఈ ప్రచారంలో నారా రోహిత్ మాట్లాడుతూ.. లాస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పి టీడీపీ, జనసేన కార్యకర్తలను ఉత్సాపరిచారు. ఇంతకీ నారా రోహిత్ ఏం మాట్లాడంటే.. “పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అని. అలాగే మనం కొట్టాల్సిన లాస్ట్ పంచ్ బ్యాలెట్ మీద. ఈసారి మీరు కొట్టే పంచ్ కి ఫ్యాన్ రెక్కలు తెగి పడిపోవాలి” అంటూ చెప్పుకొచ్చారు. పవన్ డైలాగ్ నారా రోహిత్ నోటి నుంచి రావడంతో.. జనసేన అభిమానులు ఇందుకు సంబంధించిన వీడియోని వైరల్ చేస్తున్నారు.

కాగా టాలీవుడ్ లోని మరో స్టార్ నటుడు సప్తగిరి కూడా జనసేన, టీడీపీ ప్రచారంతో ఏపీలో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా గుడివాడ ప్రచారంలో పాల్గొన్నారు. గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతు తెలుపుతూ.. తనకి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్స్ ని సప్తగిరి కోరారు. ఒక్కరి కులాలు, మతాలు పక్కన పెట్టి సమస్యలు, అభివృద్ధి చూసి.. వెనిగండ్ల రాముకు ఒక అవకాశం ఇవ్వాలంటూ సప్తగిరి ఓటర్స్ ని అభ్యర్ధించారు.

  Last Updated: 07 May 2024, 08:12 AM IST