Nara Rohit : మీడియాని ప్రశ్నించనున్న నారా రోహిత్…

నారా రోహిత్ (Nara Rohit) బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో అందర్నీ ఆకట్టుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Nara Rohit Will Question The Media...

Nara Rohit Will Question The Media...

Nara Rohit : నారా రోహిత్ బాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆతర్వాత సోలో, ప్రతినిధి ఇలా డిఫరెంట్ మూవీస్ ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేశాడు. ఆతర్వాత స్పీడు పెంచి వరుసగా చాలా సినిమాలు చేశాడు. ఒకానొక టైమ్ లో నెలకో సినిమా రిలీజ్ చేశాడు. ఏ సినిమా షూటింగ్ లో ఉందో..? ఏ సినిమా రిలీజైందో కూడా అంతగా తెలిసేది కాదు. అంతలా వరుసగా సినిమాలు చేసిన నారా రోహిత్ ఏమైందో ఏమో కానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. సినిమాలకు దూరమైన నారా రోహిత్ (Nara Rohit) రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త కూడా వచ్చింది.

అయితే.. ఇప్పుడు రాజకీయాల్లోకి కాకుండా సినిమాల్లోకి మళ్లీ రావాలి అనుకుంటున్నాడట. అనుకోవడమే కాదు.. దీనికి సంబంధించి అంతా సెట్ చేసుకున్నాడట. ఈసారి ప్రతినిథి సినిమాకి సీక్వెల్ తో వస్తున్నాడట. అయితే.. ప్రతినిధి వర్క్ చేసిన వాళ్లలో నారా రోహిత్ (Nara Rohit) ఒక్కడే ఈ సీక్వెల్ లో ఉంటాడట. మిగిలిన వాళ్లంతా వేరే టీమ్ అని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రతినిధి 2 అనే టైటిల్ ఖరారు చేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆగష్టు నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నాడట.

అయితే.. ప్రతినిధి సినిమా సమాజానికి ఎన్నో ప్రశ్నల్ని సంధించింది. ఇప్పుడు ప్రతినిధి 2 సినిమా ద్వారా మీడియాని ప్రశ్నించాలి అనుకుంటున్నాడట. ఇంతకీ విషయం ఏంటంటే.. మీడియా బ్రేకింగ్ న్యూస్ పేరుతో న్యూస్ ఛానల్స్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాయని.. అందుకనే మీడియానే టార్గెట్ గా ఈ చిత్రాన్ని తీయాలి అనుకుంటున్నాడని తెలిసింది. వినడానికి బాగానే ఉంది కానీ.. తేడా వస్తే.. మీడియాను వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. మొత్తానికి నారా రోహిత్ రీ ఎంట్రీలో రిస్క్ చేస్తున్నాడు. మరి.. ప్రతినిధి 2 ఎలాంటి ఫలితాన్ని అందిస్తాదో చూడాలి.

Also Read:  Anurag Thakur: చాలా రాష్ట్రాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయి!

  Last Updated: 22 Jul 2023, 05:47 PM IST