Site icon HashtagU Telugu

Dasara Boxoffice Collections: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ‘నాని’ దసరా.. రెండు రోజుల్లో 53 కోట్లు వసూల్!

Dasara

Dasara

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరుగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో 53 Cr+ వసూళ్లు సాధించి టాలీవుడ్ సత్తా ఎంటో చాటింది. నేచురల్ స్టార్ నాని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దసరా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటంతో ఊహించని కలెక్షన్లు వస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ. 38 కోట్ల+ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు 15 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల మొత్తం 53 కోట్లకు చేరుకుంది.

ఈ గురువారం భారీ అంచనాల మధ్య విడుదలైన దసరాకు యూఎస్‌ఏలో ఒకరోజు ముందు ప్రీమియర్ షోలు నిర్వహించగా, అన్ని చోట్ల నుంచి దసరాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా నిజంగానే అన్ని అంచనాలను అందుకుంది. ఇలా రెండు రోజుల్లోనే రికార్డ్ బిజినెస్ చేసింది. కేవలం మౌత్ టాక్ ద్వారా ఈ సినిమా కలెక్షన్లు పుంజుకున్నాయి.

దీంతో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహా బాలయ్య బాబు రికార్డులను అధిగమించింది. అయితే దసరాతో పాటు మరే మూవీ విడుదల కాకపోవడం, శని, ఆదివారాల్లో రష్ పెరగనుండటంతో మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. USAలో, ఇప్పటి వరకు $1.2 మిలియన్ వసూలు చేసిన దసరా నానికి అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం ఇతర ప్రాంతాలలో కూడా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం.

Also Read: Pushpa 2 Stopped: సుకుమార్ షాకింగ్ డెసిషన్.. పుష్ప-2 షూటింగ్ నిలిపివేత!

Exit mobile version