Site icon HashtagU Telugu

Nani Repeates Dasara Combination : దసరా కాంబోనే నెక్స్ట్.. మరో బ్లాక్ బస్టర్ ఫిక్స్..!

Dasara

Dasara

Nani Repeates Dasara Combination సినిమాల ప్లానింగ్ లో నాని తర్వాతే ఎవరైనా అనిపించేలా అతని ప్రాజెక్ట్ లు ఉంటాయి. కెరీర్ లో మాక్సిమం రిస్క్ చేసేందుకు నాని ప్రయత్నించడు. అంటే కొత్త దర్శకులతో సినిమా చేయడం రిస్కే కదా అనుకోవచ్చు అది అతని సెలక్షన్ మీద ఉన్న నమ్మకం కానీ రిస్క్ కాదు. రిస్క్ అంటే తన బడ్జెట్ ని మించి సినిమా తీయడం.. తను ఇదివరకు చేయని మాస్ యాంగిల్ ట్రై చేయడం అది రిస్క్. కానీ ఆ రిస్క్ నే లాస్ట్ ఇయర్ చేసి సూపర్ హిట్ కొట్టాడు నాని.

We’re now on WhatsApp : Click to Join

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని చేసిన దసరా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత నాని (Nani) సినిమాల రేంజ్ మారిపోయింది. దసరా చేశాడు కదా ఇక మీదట అన్ని మాస్ సినిమాలే చేస్తాడేమో అనుకుంటే మళ్లీ తన పంథాలో హాయ్ నాన్న తీసి సింపుల్ హిట్ అందుకున్నాడు నాని. అయితే దసరాతో హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మళ్లీ దసరా కాంబోలోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

నాని సరిపోదా శనివారం (Saripoda Sanivaram) సినిమాతో బిజీగా ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమా కూడా నానితోనే చేయాలని శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ఫిక్స్ అయ్యాడు. దసరా నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. నాని కూడా శ్రీకాంత్ కథ విని ఎగ్జైట్ అయ్యాడట. తప్పకుండా దసరా కాంబో అంటే అందుకు తగినట్టుగానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

నాని సరిపోదా శనివారం సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. దసరా కాంబో సినిమా అంటే దసరాని మించి ఆశిస్తారు ఆడియన్స్ మరి అలాంటి కంటెంట్ తోనే వాళ్లిద్దరు వస్తున్నారా.. దసరా తో నానికి మెమరబుల్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల ఈసారి ఎలాంటి కథతో వస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు రానున్నాయి.

Also Read : Sandeep Kishan : ఊరు పేరు భైరవకోన ట్రైలర్ టాక్.. సందీప్ కిషన్ ఈసారి కొట్టేలా ఉన్నాడు..!

సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా కూడా వెరైటీ సబ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేలా చేస్తున్నారట. నాని తో మళ్లీ అంటే ఈసారి శ్రీకాంత్ మరో అద్భుతాన్ని చేస్తాడా లేదా అన్నది చూడాలి. హాయ్ నాన్న తర్వాత నాని నటిస్తున్న సినిమాల మీద ఈసారి పాన్ ఇండియా ఆడియన్స్ కూడా గురి పెట్టారు.