Site icon HashtagU Telugu

Nani : నాని కాదంటే ఆ హీరో ఓకే చేశాడా..?

Nani Rejected Kollywood Hero Picked that movie

Nani Rejected Kollywood Hero Picked that movie

Nani కొన్ని సినిమాలు కథల దశలో చేతులు మారుతుంటాయి. కొంతమంది హీరోలు కొన్ని సినిమాలను కథ నచ్చక రిజెక్ట్ చేస్తే అది వేరే హీరో చేసి హిట్ కొడతాడు. కానీ కొందరు కథ నచ్చినా చేయని హీరోలు ఉంటారు. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకనో లేక వేరే కారణాల వల్ల సినిమాలు మిస్ అవుతారు. ఆ కథ వేరే హీరో చేసి హిట్ కొడితే అప్పుడు ఫీల్ అవుతుంటారు. అయితే ఒక హీరో కాదన్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం చాలా కామన్.

ప్రస్తుతం అలాంటి ఒక స్టోరీ తెలుగు హీరో కాదని చెప్పడంతో తమిళ హీరోతో తీసేందుకు సిద్ధం అయ్యారట. ఇంతకీ ఎవరు కాదన్నారు ఎవరు ఓకే అన్నారన్నది చూస్తే. న్యాచురల్ స్టార్ నాని కాదన్న కథను కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నానితో సిబి చక్రవర్తి ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కాలేజ్ డాన్ సినిమా సక్సెస్ అందుకోవడంతో నాని అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

నానికి లైన్ చెప్పి ఒప్పించిన సిబి చక్రవర్తి ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. అయితే ఆ సినిమా బడ్జెట్ అనుకున్న రేంజ్ లో పూర్తి చేయలేమని తెలిసి డ్రాప్ అయ్యారు. ఇప్పుడు అదే కథతో శివ కార్తికేయన్ తో చేయాలని అనుకుంటున్నాడు సిబి చక్రవర్తి. ఆల్రెడీ కాలేజ్ డాన్ వీరి కాంబోలో హిట్ కొట్టింది. అందుకే సిబి మీద పూర్తి నమ్మకంతో శివ కార్తికేయన్ సినిమా ఓకే చెప్పేశాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

కోలీవుడ్ లో వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న శివ కార్తికేయన్ సిబితో చేయబోతున్న ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Also Read : Siva RajKumar Bhairati Ranagal : పుష్ప 2 తో పోటీకి సై అన్న స్టార్ హీరో..?