Court Collections : ప్రియదర్శి మెయిన్ లీడ్ లో నాని నిర్మాణ సంస్థలో కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కోర్ట్. పోక్సో కేసు ఆధారంగా అక్రమంగా ఒకర్ని అరెస్ట్ చేస్తే అతన్ని ఎలా బయటకు తీసుకొచ్చారు అనే కథాంశంతో కోర్ట్ సినిమాని తెరకెక్కించారు. సినిమా రిలీజ్ ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
కోర్ట్ సినిమా మార్చ్ 14న నిన్న రిలీజయింది. అయితే రెండు రోజుల ముందు నుంచే ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ పాజిటివ్ టాక్ తో కోర్ట్ సినిమా దూసుకుపోతుంది. ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి కోర్ట్ సినిమాకు 8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన్నట్టు ప్రకటించారు. ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి అంటే మాములు విషయం కాదు. దీంతో మూవీ యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. నేడు, రేపు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల్లో ఇంకో 10 కోట్లపైన ఈజీగా కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. చిన్న సినిమా కలెక్షన్స్ లో అదరగొడుతుంది.
ఇక కోర్ట్ సినిమాలో అందరూ అద్భుతంగా నటించి మెప్పించారు. ముఖ్యంగా శివాజీ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. నెగిటివ్ పాత్రలో శివాజీ కోర్ట్ సినిమాలో తన నటనతో మెప్పించాడు.
Also Read : Janasena Formation Day : నా తెలంగాణ కోటి రతనాల వీణ – పవన్ కళ్యాణ్