న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం వరుస సక్సెస్ ఫాం లో ఉన్న విషయం తెలిసిందే. నాని సినిమా వస్తుంది అంటే చాలు హిట్ పక్కా అనే టాక్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నాన్న రెండు హిట్లు అందుకున్న నాని అదే హిట్ మేనియా ఈ ఏడాది కూడా కొనసాగించాలని చూస్తున్నాడు. నాని ప్రస్తుతం సరిపోదా శనివరం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ను వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా లైన్ లో ఉంది. లేటెస్ట్ గా నాని దసరా కాంబోలో సినిమా కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే దసరా కాంబోలో వస్తున్న ఈ సినిమా దసరాకి సీక్వల్ కథతో వస్తున్నారని తెలుస్తుంది. అదేంటి దసరా కథ అక్కడితో ముగిసింది కదా అంటే అలాంటి మరో కథతోనే శ్రీకాంత్ ఓదెల వస్తున్నాడట.
దసరా 2 అంటూ నాని, కీర్తి సురేష్ లతోనే ఈ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ దసరా నిర్మాతతో ఆ సినిమాలో నటించిన దీక్షిత్ శెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు దసరా 2 కూడా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. నాని దసరా 2 చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.