న్యాచురల్ స్టార్ నాని(Nani) హీరోగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా కొత్త దర్శకుడు శౌరువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హాయ్ నాన్న. నాని దసరా(Dasara) లాంటి మాస్ హిట్ తర్వాత రాబోతున్న క్లాస్ సినిమా కావడంతో మంచి అంచనాలే నెలకొన్నాయి ఈ సినిమాపై. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, గ్లింప్స్ తో ఇది తండ్రి కూతుళ్ళ ఎమోషన్స్ ఉండే సినిమా అని అర్థమైపోయింది.
తాజాగా హాయ్ నాన్న(Hi Nanna) టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో నాని, కూతురు మధ్య ఉండే ఎమోషన్స్ చూపిస్తూనే వీరి లైఫ్ లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ తో ప్రేమ వ్యవహారాలు కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో మృణాల్ తో నాని లిప్ కిస్ లు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్లోనే కొన్ని లిప్ కిస్ లు చూపించారు. దీంతో హాయ్ నాన్న సినిమా కేవలం తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ మాత్రమే కాకుండా లవ్ రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది.
ఇక హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. మరి దసరా లాంటి భారీ హిట్ తర్వాత నాని ఈ క్లాస్ సినిమాతో హిట్ కొడతాడా చూడాలి.
Also Read : Chiranjeevi : మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్‌కి రెడీ.. థియేటర్స్ లో మోత ఖాయం..