Site icon HashtagU Telugu

Nani Hi Nanna : ఎమోషనల్ సినిమాలో ఈ లిప్ లాక్స్ ఏంటి బాసు..?

Nani Hi Nanna Teaser Lip Lock Shocking

Nani Hi Nanna Teaser Lip Lock Shocking

Nani Hi Nanna న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా హాయ్ నాన్న. జెర్సీ తర్వాత నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపిస్తున్నారు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందించారు. Nani హాయ్ నాన్న సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు. కూతురుతో జీవితాన్ని నడిపిస్తున్న అతని జీవితంలోకి మరో అమ్మాయి వస్తుంది. ఆమెతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన హీరో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది హాయ్ నాన్న కథ.

టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఎమోషనల్ కంటెంట్ ఓకే కానీ ఈ (Hi Nanna) సినిమాలో నాని మృనాల్ లిప్ లాక్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఎమోషనల్ సినిమా అని చెప్పి ఈ లిప్ లాక్స్ ఏంటి బాసు అంటూ ఆడియన్స్ రియాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ లో తన హాట్ ఇమేజ్ ని పక్కన పెట్టి తెలుగులో మృనాల్ సీతా మహాలక్ష్మిగా మెప్పించింది. సీతారామం సినిమా వల్లే మృనాల్ (Mrunal Thakur) తెలుగులో సూపర్ పాపులర్ అయ్యింది. అలాంటి మృనాల్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ఫోటో షూట్స్ చేస్తుంది.

ఇది చాలదు అన్నట్టు తను చేస్తున్న సినిమాల్లో ఇలా లిప్ లాక్స్ తో రెచ్చిపోతుంది. తెలుగులో పాగా వేయాలన్న పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్న మృనాల్ తన ప్రతి అటెంప్ట్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. హాయ్ నాన్నలో మృనాల్ నాని లిప్ లాక్ సోషల్ మీడియాలో డిస్కషన్స్ గా మారాయి.

నాని హాయ్ నాన్న సినిమాకు హేషం అబ్ధుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దసరాతో ఈ ఇయర్ మొదట్లోనే బ్లాక్ బస్టర్ అందుకున్న నాని హాయ్ నాన్నతో ఏం చేస్తాడో చూడాలి.

Also Read : Global Star Ram Charan : ఇండియన్ 3 లో గ్లోబల్ స్టార్..?