Nani : అక్కడ నాని దూకుడు ఆగేలా లేదు.. హాయ్ నాన్న మరో రికార్డ్..!

న్యాచురల్ స్టార్ నాని (Nani) దూకుడు కొనసాగుతూనే ఉంది. శౌర్యువ్ డైరెక్షన్ లో నాని నటించిన హాయ్ నాన్న సినిమా రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్

Published By: HashtagU Telugu Desk
Nani Hi Nanna Another Record In Usa

Nani Hi Nanna Another Record In Usa

న్యాచురల్ స్టార్ నాని (Nani) దూకుడు కొనసాగుతూనే ఉంది. శౌర్యువ్ డైరెక్షన్ లో నాని నటించిన హాయ్ నాన్న సినిమా రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ఈ ఇయర్ ఆల్రెడీ దసరా తో సూపర్ హిట్ అందుకున్న నాని అది మాస్ అటెంప్ట్ కాగా ఈసారి తన మార్క్ ఎమోషనల్ మూవీ హాయ్ నాన్నతో వచ్చారు.

ఇక ఈ సినిమా యూఎస్ లో 1.5 మిలియన్ మార్క్ దాటేసింది. మహేష్ తర్వాత 9 సినిమాల్లో నాని యూఎస్ లో 1 మిలియన్ మార్క్ దాటాడు. ఇక 3 సినిమాలతో 1.5 మిలియన్ మార్క్ క్రాస్ చేశాడు. హాయ్ నాన్నతో పాటుగా అంతకుముందు వచ్చిన జెర్సీ, దసరా సినిమాలు 1.5 మిలియన్ మార్క్ అందుకున్నాయి.

Also Read : Ranbir Kapoor : స్పిరిట్ ముందు రణ్ బీర్ తో మరోటి.. సందీప్ ప్లానింగ్ ఛేంజ్ వెనక రీజన్ అదేనా..?

హాయ్ నాన్న మరోసారి నాని సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమా ఫుల్ రన్ లో 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసేలా ఉందని చెప్పొచ్చు. హాయ్ నాన్న సినిమాలో నాని, మృణాల్ లతో పాటుగా చైల్డ్ ఆర్టిస్ట్ కియరా ఖన్నా కూడా అద్భుతంగా నటించింది. ఈ సినిమా హిట్ క్రెడిట్ లో ఆ చిన్నారికి కూడా భాగం ఇవ్వాల్సిందే.

మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ సీతారామం తో సూపర్ హిట్ అందుకోగా హాయ్ నాన్నతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. నాని మృణాల్ ఈ కాంబో ఆడియన్స్ కు మంచి ఫీల్ గుడ్ ఎక్స్ పీరియన్స్ అందించారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 16 Dec 2023, 07:12 PM IST