Site icon HashtagU Telugu

Nani : హీరోగానే కాదు నిర్మాతగా కూడా ఆ రికార్డ్ సెట్ చేసిన నాని..

Nani Creates New Record in USA as Producer with Court Movie

Nani Court

Nani : నాని హీరోగా దూసుకుపోతున్నాడు. క్లాస్, మాస్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో రికార్డులు సెట్ చేస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాలో నాని ప్రతి సినిమా 1 మిలియన్ డాలర్స్ పైగా వసూలు చేస్తుంది. ఇప్పటివరకు అమెరికాలో నానికి పది సినిమాలు 1 మిలియన్ పైగా వసూళ్లు సాధించాయి. ఏ టాలీవుడ్ హీరోకి కూడా ఈ రికార్డ్ లేదు.

అయితే ఇన్నాళ్లు హీరోగా ఈ రికార్డ్ సాధించిన నాని ఇప్పుడు నిర్మాతగా కూడా ఈ రికార్డ్ సాధించాడు. నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రియదర్శి మెయిన్ లీడ్ లో రామ్ జగదీశ్ దర్శకత్వంలో పోక్సో కేసు ఆధారంగా కోర్ట్ అనే సినిమా తెరకెక్కించాడు.

చిన్న సినిమాగా తెరకెక్కిన కోర్ట్ పెద్ద హిట్ అయింది. కోర్ట్ సినిమా ఇప్పటికే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఇక అమెరికాలో కోర్ట్ సినిమా తాజాగా 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 8 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ విషయం మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే భారీ కలెక్షన్స్ సాధించినట్టే. పెద్ద హీరోల సినిమాలకే వచ్చే ఈ కలెక్షన్స్ చిన్న సినిమాలకు చాలా రేర్ గా వస్తుంటాయి. ఇన్నాళ్లు హీరోగా 1 మిలియన్ డాలర్స్ సినిమాలు సాధించిన నాని ఇప్పుడు నిర్మాతగా కూడా కోర్ట్ సినిమాతో 1 మిలియన్ డాలర్స్ సాధించి సరికొత్త రికార్డ్ సాధించాడు. ఇక నాని త్వరలో మే 1న హిట్ 3 సినిమాతో రానున్నాడు.

Also Read : Sreeleela : శ్రీలీలకు బోల్డ్ డార్క్ రోల్ ఆఫర్.. ఆ సినిమా సీక్వెల్ చేస్తుందా?