Nani : రెండు సినిమాలకు నాని బిగ్ డీల్..!

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇప్పుడు కెరీర్ లో సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస హిట్లు పడేసరికి నాని సినిమాలపై మార్కెట్ పెరిగింది. దసరాతో తనకు బోర్డర్స్ అంటూ లేవని తేల్చి చెప్పిన

Published By: HashtagU Telugu Desk
Nani Rejected Kollywood Hero Picked that movie

Nani Rejected Kollywood Hero Picked that movie

న్యాచురల్ స్టార్ నాని (Nani) ఇప్పుడు కెరీర్ లో సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస హిట్లు పడేసరికి నాని సినిమాలపై మార్కెట్ పెరిగింది. దసరాతో తనకు బోర్డర్స్ అంటూ లేవని తేల్చి చెప్పిన నాని ధరణి పాత్రలో తన దమ్ము చూపించాడు. ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో హాయ్ నాన్న అంటూ మరోసారి తన మార్క్ ఎమోషనల్ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాల హిట్ తో నాని మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా చూపించాడు.

ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలను డివివి దానయ్య నిర్మిస్తుండటం విశేషం. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా నిర్మించిన దానయ్య మీడియం రేంజ్ సినిమాలతో కూడా అదరగొట్టనున్నాడు.

ఓ పక్క పవన్ కళ్యాణ్ ఓజీ చేస్తున్న దానయ్య నానితో రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లాక్ చేశాడు. అంతేకాదు నాని కెరీర్ బిగ్గెస్ట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ డీల్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. నాని అంతకుముందు సినిమాకు 15 నుంచి 17 కోట్ల దాకా తీసుకుంటుండగా ఇప్పుడు సినిమాకు పాతిక కోట్లు చెబుతున్నాడట. అయితే రెండు సినిమాలకు కలిపి దానయ్య డివివి 40 కోట్లకు మాట్లాడుకున్నారట. సో రెండు సినిమాలతో నాని 40 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. చిన్నగా నాని కూడా స్టార్ లీగ్ లోకి వెళ్తున్నాడని చెప్పొచ్చు.

Also Read : Pushpa 2 : పుష్ప స్పెషల్ ఐటమ్.. రేసులో మరో ముద్దుగుమ్మ..!

  Last Updated: 02 Mar 2024, 03:15 PM IST