Site icon HashtagU Telugu

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్.. పోస్ట‌ర్ మామూలుగా లేదుగా..!

Nandamuri Mokshagna

Nandamuri Mokshagna

Nandamuri Mokshagna: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) సినీ రంగ ప్రవేశం చేశారు. స్టార్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ‘సింబా ఈజ్‌ కమింగ్‌’ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. దీంతో అభిమానులు విషెస్‌ చెబుతున్నారు.

అయితే ఈ లుక్‌లో మోక్ష‌జ్ఞ చాలా స్మార్ట్‌గా క‌నిపిస్తున్నారు. ఈ మూవీ మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఉండ‌నుంది. ఆయ‌న బ‌ర్త్‌డే సందర్భంగా సినిమాలోని లుక్‌ని విడుద‌ల చేశారు. సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమా చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్‌, అప్డేట్స్ వెల్ల‌డించ‌నున్నారు. అయితే ఈ మూవీతో మోక్ష‌జ్ఞ నంద‌మూరి అభిమానుల‌ను ఏ మేర‌కు మెప్పిస్తారో చూడాలి. అయితే మోక్ష‌జ్ఞ తొలి సినిమా రూ. 60 కోట్ల‌తో నిర్మించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తొలి సినిమాకే ఇంత బ‌డ్జెట్ పెడుతున్నారంటే సినిమా క‌థ ఎలా ఉండ‌బోతుందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఈ మూవీ ప్ర‌శాంత్ వ‌ర్మ యూనివ‌ర్స్‌లో భాగ‌మా..? లేక ఇది వేరే క‌థ‌నా అనేది తెలియాల్సి ఉంది. బాల‌కృష్ణ అభిమానులు ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్న క్ష‌ణం రావ‌టంతో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Vinakaya Chavithi 2024: వినాయకచవితి పండుగను 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?

ఇక‌పోతే నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌, క‌ల్యాణ్ రామ్‌లు హీరోలు రాణిస్తున్నారు. బాల‌కృష్ణ ప్ర‌స్తుం బాబీ డైరెక్ష‌న్‌లో త‌న 109వ చిత్రంలో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు ఎన్టీఆర్ దేవ‌ర‌, వార్‌-2 మూవీ చిత్రాల‌తో తీరిక క్ష‌ణం లేకుండా ఉన్నారు. క‌ల్యాణ్ రామ్ కూడా త‌నదైన శైలిలో దూసుకుపోతున్నాడు. మోక్ష‌జ్ఞ కూడా ఈ నంద‌మూరి హీరోలాగా టాప్ స్టార్‌గా ఎదుగుతాడ‌ని ఇప్ప‌టి నుంచే అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మూవీ కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్‌ని నిర్మాత‌లు సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం.