Site icon HashtagU Telugu

Mokshagnya : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే కటౌట్లు, బ్యానర్లు, పాలాభిషేకాలు.. మోక్షజ్ఞ హవా..

Nandamuri Fans Celebrating Mokshagnya Entry with Huge Celebrations

Mokshagnya

Mokshagnya : బాలకృష్ణ(Balakrishna) తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎట్టకేలకు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఇప్పటికి నెరవేరుతుంది. ఇటీవల మోక్షజ్ఞ పుట్టిన రోజు నాడు హీరోగా రాబోతున్నట్టు మొదటి సినిమాని ప్రకటించారు. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా మొదటి సినిమాని ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే మోక్షజ్ఞ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ఫ్యాన్స్ చేసే హంగామా చూస్తే తెలిసిపోతుంది. ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, కనీసం సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు , షూట్ మొదలు పెట్టలేదు. జస్ట్ హీరోగా వస్తున్నాడు అని ఒక్క పోస్టర్ ఇవ్వగానే ఆ పోస్టర్ తో అభిమానులు ఏకంగా 60 అడుగుల కటౌట్ పెట్టారు. ఆ కటౌట్ కి పాలాభిషేకాలు చేసారు. ఆ పోస్టర్ తో బ్యానర్లు కట్టారు. కేకులు కోశారు, మోక్షజ్ఞ పేరుతో సేవా కార్యక్రమాలు చేసారు.

అసలు ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ హీరోకు చేసేంత హడావిడి మోక్షజ్ఞకు చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. అభిమానులు మోక్షజ్ఞ పేరుతో చేసే హడావిడి ఫోటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక్క అనౌన్స్మెంట్ కే ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారంటే ఇక సినిమా రిలీజయితే ఫ్యాన్స్ సందడి ఆకాశాన్ని అంటుతుందేమో.

 

Also Read : Tamannaah Bhatia : విజయ్ వర్మ కంటే ముందు రెండు సార్లు లవ్‌లో.. తమన్నాకు రెండు బ్రేకప్‌లు..