నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎలా ఉంటాడో అందరికి తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం ఆయనది. మనసులో ఒకటి ఉంచుకొని , బయటకు ఒకటి మాట్లాడే టైపు కాదు..తాను ఏమనాలకున్నాడో..అది డైరెక్ట్ గా పేస్ టు పేస్ అనేస్తాడు. అవతలి వ్యక్తి ఏమనుకుంటాడు..? ఇలా అనొచ్చా లేదా..? ఎవరైనా బాధపడతారా..? వంటివి ఏమి ఆలోచించాడు. అందుకే బాలయ్య అంటే చాలామంది ఇష్టపడుతారు. తాజాగా మరోసారి అలాంటి కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.
తాజాగా దుబాయ్ (Dubai) లో ఐఫా అవార్డుల ( IIFA Utsavam) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో బాలకృష్ణ కు గోల్డెన్ లెగసీ అవార్డు (Golden Legacy Award) దక్కింది. ఆ అవార్డును అందుకునేందుకు గాను అక్కడకి వెళ్లిన బాలకృష్ణ స్టేజ్ పై సందడి చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు కలిసి స్టేజ్ ను షేర్ చేసుకున్నాడు. ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నారు. అవార్డ్ వేడుక సందర్భంగా రెడ్ కార్పెట్ పై బాలకృష్ణ మాట్లాడుతూ.. గోల్డెన్ లెగసీ అవార్డ్ అందుకోవడంపై సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి సీనియర్ ఎన్‌టీఆర్ గురించి, ఆయన గొప్పదనం గురించి గుర్తుచేసుకున్నారు.
ముందుగా నేను నా నిర్మాతలు, దర్శకులు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ కేవలం నా రాష్ట్రానికి, నా భాషకు చెందినవారు మాత్రమే రాలేదు. అన్ని భాషల సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు అంతా ఒకే ప్లాట్‌ఫార్మ్‌పై ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఇష్టపడుతున్న వారందరికీ థాంక్యూ. హీరోగా 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్నందుకు ఐఫా లెగసీ అవార్డ్ నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. రామారావు లెగసీ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
బాలకృష్ణ వారసులు ఎవరు అంటే ఏం చెప్తారు అంటూ మీడియా ప్రశ్నించగా..నా కొడుకు, నా మనవడు మాత్రమే నా వారసులు అంటూ బాలకృష్ణ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలను పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ జూ. ఎన్టీఆర్ ను బాలయ్య నందమూరి ఫ్యామిలీ వారసుడు కాదు అన్నట్లుగా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ విషయంలో అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : AP Politics : జగన్ ది గ్రేట్ పాలిటిక్స్.. చంద్రబాబుది డర్టీ పాలిటిక్స్ – పోసాని..