Site icon HashtagU Telugu

Padma Bhushan : తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ

Balakrishna Received Padma

Balakrishna Received Padma

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల కార్యక్రమం (Padma Awards Event) సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా, రాజకీయంగా హిందూపురం ఎమ్మెల్యేగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరై తన ప్రత్యేకతను చాటారు.

Metro : మెట్రోలో చేయకూడని పని చేసిన మహిళ..అధికారులు సీరియస్

బాలకృష్ణ పంచెకట్టు ధరించి, మెడలో కండువా వేసుకొని పద్మభూషణ్(Padma Bhushan) అవార్డు స్వీకరించడం తెలుగు ప్రజల గర్వానికి కారకమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం స్వీకరించిన బాలయ్య, తన సాంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పాడు. ఈ సందర్భంలో తెలుగు ప్రేక్షకులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పద్మ అవార్డుల కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. అలాగే తమిళ సినిమా నటుడు అజిత్ కుమార్ కూడా పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ వేడుకతో మరోసారి తెలుగు తమ్ముళ్ల ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా వినిపింపజేయడంలో బాలకృష్ణ ముఖ్యపాత్ర పోషించాడు.