Site icon HashtagU Telugu

Nandamuri Balakrishna: ANRను అవమానించలేదు.. అవన్నీ యాదృచ్చికంగా వచ్చిన మాటలే!

Nandamuri Balakrishna

Balyya

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించారు. ANR ను నేను అవమానించలేదు.. యాదృచ్చికంగా వచ్చిన మాటలే తప్ప కావాలని అనలేదు అని బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. (ANR) ను నేను బాబాయ్ అని పిలిచేవాడిని.. ఆయనపై ప్రేమ నా గుండెల్లో ఉందనీ, తన పిల్లలకంటే ఎక్కువగా నాపై ప్రేమ చూపేవారని ఆయన అన్నారు. ఏవో కొన్ని ఫ్లో లో వచ్చే మాటలను నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదని ఆయన తేల్చి బాలకృష్ణ చెప్పారు. ఇండస్ట్రీకి NTR, ANR రెండు కళ్ళు, పొగడ్తలకు పొంగిపోకపోవడం, విమర్శలకు కుంగిపోకపోవడం బాబాయ్ వద్దే నేర్చుకున్నానని ఈ సందర్భంగా బాలయ్య అన్నారు.

వీరసింహారెడ్డి షూటింగ్ లో జరిగిన సంగతులు వివరిస్తూ.. ఓ ఆర్టిస్ట్ తో కలసి పాత విషయాలన్నీ గుర్తుచేసుకున్నారు. వేద శాస్త్రాలు, నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు .. అక్కినేని తొక్కినేని ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అని (Nandamuri Balakrishna) అన్నారు. దీంతో ఈ కామెంట్స్ టాలీవుడ్ లో వివాదానికి దారితీయడంతో  అక్కినేని నాగచైతన్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలని ట్విట్టర్ వేదికగా తెలిపారు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ ట్వీట్ చేశారు. హీరో అఖిల్ (Akhil) కూడా ఘాటుగానే రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా బాలయ్య తన వ్యాఖ్యలపై స్పందించడంతో ‘అక్కినేని తొక్కినేని’ వివాదం ముగిసినట్టేనని ఇరువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Also Read: Anant Ambani and Radhika: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులు