నమ్రతా శిరోద్కర్ (Namrata) పరిచయం అవసరం లేని పేరు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) భార్య కావడానికి ముందు ఆమె ఓ మోడల్. బాలీవుడ్, టాలీవుడ్‌లో అనేక సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే మహేష్‌తో ప్రేమలో పడింది. 2005లో పెళ్లి చేసుకుంది. భార్యగా మారిన తర్వాత నటనకు దూరమై కుటుంబాన్ని అన్ని విధాలా అండగా నిలుస్తోంది. టాలీవుడ్‌లో ఇష్టమైన జంటలలో మహేష్, నమ్రత (Namrata) జంట ఒకటి.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నా ఆమె ఎప్పుడూ మీడియాతో మాట్లాడదు. ఆమె ఇటీవల ఒక జర్నలిస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. జీవితం, మహేష్, ప్రేమ, పిల్లలు, వ్యాపారం, మరెన్నో విషయాల గురించి ఓపెన్ చేసింది. ‘పోకిరి’ మహేష్‌కి ఇష్టమైన సినిమా అని, ‘వంశీ’ మూవీ కాదని చెప్పింది. తమ గారాల కూతురు సితార (Sitara) అనుకోకుండా మా జీవితంలోకి వచ్చిందన్నారు. గౌతమ్ నెలలు నిండకుండానే శిశువుగా జన్మించినప్పుడు హెల్త్ పరంగా చాలా ఇబ్బందలు పడ్డాం’’ అని చెప్పింది.
తనకు మహేష్‌కు విభేదాలు ఉన్నాయనే దాని గురించి నమ్రత మాట్లాడారు. పిల్లల విషయంలో నాకు, మహేశ్ మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతుంటాయి. సితార, గౌతమ్ కు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మహేశ్ (Mahesh) ను అడుగుతుంటారు. ఆయన కూడా వెంటనే పిల్లలకు కావాల్సినవి ఇస్తుంటారు. కేవలం ఇలాంటి విషయాల్లోనే మాకు చిన్ని చిన్న మనస్పర్థలు వస్తుంటాయి. కానీ ఆ తర్వాత ఇద్దరమూ వాటిని పట్టించుకోం’’ అని చెప్పింది నమ్రత (Namrata).
Also Read: Donate Me A Girlfriend: నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా.. చక్కర్లు కొడుతున్న యువకుడి వీడియో!