సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన(Stampede Case)లో అల్లు అర్జున్(Allu Arjun) కు నాంపల్లి కోర్ట్ (Nampally Court) భారీ ఊరట కల్పించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుష్ప-2 ప్రీమియర్ ఘటనలో హీరో అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ (Regular Bail) లభించడం తో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ సంఘటనపై పోలీసులు అల్లు అర్జున్ సహా పలు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
Game Changer : ఐమ్యాక్స్ లో ‘గేమ్ ఛేంజర్’..మెగా ఎక్స్ పీరియన్స్ మాములుగా ఉండదు మరి ..!!
అల్లు అర్జున్‌ను A11గా పేర్కొన్న పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయబడింది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ అరెస్టు చేసే అవకాశం ఉండటంతో, రెగ్యూలర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ అనంతరం అల్లు అర్జున్‌కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే రూ.50 వేలు, రెండు పూచికత్తులను సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప-2 టీమ్ ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించింది. రేవతి కుటుంబానికి పుష్ప-2 టీమ్ రూ.2 కోట్ల సాయం చేయగా, అల్లు అర్జున్ కోటి రూపాయలు, నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షల సాయం అందించారు. ఈ ప్రమాదం తర్వాత అల్లు అర్జున్ తన బాధను వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి తన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.