Na Samiranga King Size Hit కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14 ఆదివారం రిలీజైన నా సామిరంగ మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అంటూ నాగార్జున (Nagarjuna) చేసిన ప్రమోషన్స్ ఈ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. ఈ సినిమాను కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్ట్ చేశారు. సినిమాలో కన్నడ భామ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.
We’re now on WhatsApp : Click to Join
ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. మలయాళ మూవీ పొరింజు మరియం జోస్ సినిమా రీమేక్ గా నా సామిరంగ వచ్చింది. పండుగ సెంటిమెంట్ ఇదివరకు రెండు సందర్భాల్లో కలిసి రాగా నా సామిరంగ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు నాగార్జున. నా సామిరంగ సినిమా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ కాగా 8 రోజుల్లో 21 కోట్ల షేర్ దాకా రాబట్టింది. 8 రోజుల్లో నా సామిరంగ సినిమా 44.8 కోట్ల గ్రాస్ రాబట్టింది.
సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో సంక్రాంతి హిట్ గా నా సామిరంగ నిలిచింది. ఈ సినిమా హిట్ తో నాగార్జున ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈమధ్య ఆయన చేసిన సినిమాలేవి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. కానీ నా సామిరంగ మాత్రం అదరగొట్టేసింది. ఈ సినిమా తర్వాత నాగార్జున ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తున్నారు.
Also Read : Samantha : అతని కోసం సమంత అందుకు సిద్ధమైందా.. త్వరలోనే బిగ్ అనౌన్స్ మెంట్..!
తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. శేఖర్ కమ్ముల అనగానే సెన్సిటివ్ సినిమాలు ఆశిస్తారు. అయితే ఈసారి ధనుష్ నాగార్జునతో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నారట శేఖర్ కమ్ముల.