Nagarjuna Na Saamiranga 4 Days Collections కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ నా సామిరంగ సంక్రాంతికి రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. పొంగల్ రేసులో దిగిన సినిమాల్లో మొదటి షో నుంచి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకున్న సినిమా ఇది కూడా. హనుమాన్ తర్వాత నా సామిరంగ వసూళ్లు అదిరిపోతున్నాయి. ఇక ఈ సినిమా వసూళ్ల బీభత్సం ఓ రేంజ్ లో ఉంది. సినిమా 4 రోజుల్లో 30.3 కోట్ల గ్రాస్ తో అదరగొట్టేసింది.
We’re now on WhatsApp : Click to Join
తెలుగు రెండు రాష్ట్రాల్లో నా సామిరంగ వసూళ్లు సూపర్ గా ఉన్నాయి. సినిమా 4వ రోజు 3.17 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రెండు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 15.63 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అనిపించుకుంది నా సామిరంగ.
సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్ స్పీడ్ గా సినిమాను పూర్తి చేసిన నాగార్జున. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని తెలుస్తుంది. సినిమాను కొత్త దర్శకుడే డైరెక్ట్ చేసినా నాగార్జున సీనియారిటీ అతనికి ఉపయోగపడింది. ఫైనల్ గా సినిమా ఆడియన్స్ మనసులు గెలిచింది.
ఏరియా వైడ్ గా నా సామిరంగ 4వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం – 0.85 కోట్లు
సీడెడ్ – 0.51 కోట్లు
వైజాగ్ – 47 లక్షలు
ఈస్ట్ – 42 లక్షలు
వెస్ట్ – 21 లక్షలు
కృష్ణ – 23 లక్షలు
గుంటూరు – 31 లక్షలు
నెల్లూరు – 17 లక్షలు
4వ రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో 3.17 కోట్లను కలెక్ట్ చేసి వారెవా అనిపించాడు నాగార్జున.
సంక్రాంతికి నాగార్జున సినిమా వస్తే హిట్టే అన్న సెంటిమెంట్ ని మరోసారి నా సామిరంగ ప్రూవ్ చేసింది. ఈ సినిమా విషయంలో రిలీజ్ ముందు చాలా డౌట్లు ఉన్నాయి. నాగార్జున కావాలని సంక్రాంతికి వస్తున్నాడని సినిమా అవుట్ పుట్ సరిగా రాలేదన్న టాక్ వచ్చింది.
కానీ రిలీజ్ తర్వాత ఆ కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పడింది. సినిమా వసూళ్లతో అదరగొట్టేయడం చూసి నాగార్జున సీనియారిటీ ఈ సినిమాకు సూపర్ గా వర్క్ అవుట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ అయితే నా సామిరంగ రిజల్ట్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆషిక రంగనాథ్ ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది.
Also Read : Nani Hi Nanna : నెట్ ఫ్లిక్స్ ట్రెండ్ లో హాయ్ నాన్న.. అక్కడ టాప్ 4 ఇక్కడ టాప్ 6..!
సినిమా చూసిన వారంతా ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారంటే అమ్మడు ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. కచ్చితంగా ఆషికా రంగనాథ్ కి టాలీవుడ్ నుంచి మరిన్ని అవకాశాలు వచ్చేస్తాయని సినిమా గురించి ఆమె పర్ఫార్మెన్స్ గురించి ఆడియన్స్ చెప్పుకునే టాక్ ని బట్టి చెప్పొచ్చు.