Nagarjuna : నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాగ చైతన్య – సమంత ( Naga Chaitanya – Samantha Divorce ) విడిపోవడానికి కారణం కేటీఆర్ అని , N కన్వెన్షన్ (N Convention) కూల్చకుండా ఉండాలంటే సమంత ను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేయడం తో.. నాగార్జున..సమంత ను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఫోర్స్ చేసాడు..కానీ సమంత ఒప్పుకోలేదు…అలాంటి పని చేయనంటే..చేయనని తేల్చి చెప్పడం తో..కుటుంబంలో గొడవలు జరిగాయి. కేటీఆర్ దగ్గరికి వెళ్లకపోతే మా ఇంట్లో ఉండొద్దని నాగార్జున తెచ్చి చెప్పడంతో..ఆ పని చేయలేక సమంత విడాకులు తీసుకుంది. నాగ చైతన్య – సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే అని తేల్చి చెప్పింది. రకుల్ ప్రీతీ సింగ్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అని పలువురు హీరోయిన్స్ కు మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని సురేఖ తెలిపింది.
మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు చిత్రసీమ తో పాటు ఇటు రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. చిత్రసీమ మొత్తం కొండా సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేయడం తో తన మాటను వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించింది. ఇష్టం వచ్చినట్లు మాటలు అనడం..తర్వాత వెనక్కు తీసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇదే తరుణంలో నాగార్జున..కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టు (Nampally Court)లో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు. ఇటు కేటీఆర్ ( KTR ) సైతం సురేఖ కు లీగల్ నోటీసులు పంపడం జరిగింది.
Read Also : Blood Purify : రక్తాన్ని శుద్ధి చేయడానికి ఈ ఆహారాలను తీసుకోండి..!