Naga Chaitanya – Sobhita : మొదలైన నాగచైతన్య – శోభిత పెళ్లి వేడుకలు.. హల్దీ సెలబ్రేషన్స్ వీడియో చూశారా?

తాజాగా నేడు వీరి హల్దీ వేడుకలు జరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Nagachaitanya Sobhita Dhulipala Wedding Works Started Haldi Ceremony Photos goes viral

Nagachaitanya Sobhita

Naga Chaitanya – Sobhita : నాగచైతన్య హీరో శోభితని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో పడి కొన్నాళ్ళు డేటింగ్ తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరగ్గా డిసెంబర్ 4న వీరి పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారు.

నాగచైతన్య – శోభిత పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు జరగనుంది. తాజాగా నేడు వీరి హల్దీ వేడుకలు జరిగాయి. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగచైతన్య – శోభిత ఇద్దరికీ ఒకేచోట హల్దీ వేడుకలు జరిగాయి. ఈ హల్దీ వేడుకలతో ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలయింది.

దీంతో చైతన్య , శోభిత ఫ్యాన్స్ వీరి పెళ్లి కోసం, పెళ్లి ఫోటోలు, వీడియోల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అఖిల్ కూడా ఇటీవలే జైనాబ్ రవ్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

Also Read : Nandamuri Mokshagna : మోక్షజ్ఞ రెడీ అవుతున్నాడు.. త్వరలోనే షూట్.. ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్..

  Last Updated: 29 Nov 2024, 11:25 AM IST