Naga Chaitanya & Keerthy: కీర్తి సురేశ్ తో చైతూ రొమాన్స్.. అప్ డేట్ ఇదిగో!

చైతు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Chiatanya

Chiatanya

ప్రస్తుతం అక్కినేని హీరోలకు బ్యాడ్ టైం నడుస్తోంది. అఖిల్ ఏజెంట్ మూవీతో, చైతూ కస్టడీతో నిరాశపర్చారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య తన తదుపరి చిత్రంతో హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. చందూ మొండేటి డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇప్పటికే కథ పూర్తయింది.

ప్రస్తుతం చందూ మొండేటి మిగతా కాస్టింగ్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. చైతు సరసన కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. దసరాలో వెన్నెల పాత్రను పోలి ఉండటంతో ఈ సినిమాకు ఆమె పర్ఫెక్ట్ అని, అలాగే చైతుకి కూడా కొత్త కాంబినేషన్ గా ఉంటుందని భావిస్తున్నారట. డేట్స్ అడ్జస్ట్ అయితే కీర్తిను ఫిక్స్ చేసుకోవడం ఖాయం.

కస్టడీ మూవీతో నిరాశపర్చినా ఈ మూవీతో గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. కాగా కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ పెంచేశారనే టాక్ వినిపిస్తుంది. ప్రజెంట్ కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ రూ. 2 కోట్ల వరకు ఉందట. దాన్ని ఏకంగా రూ. 3 కోట్లకు పెంచిందట. ఎవరు కొత్త ప్రాజెక్ట్ కోసం సంప్రదించినా మూడు కోట్లు కావాలంటుందట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

Also Read: Minister Errabelli: వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఎర్రబెల్లి

  Last Updated: 20 Jul 2023, 05:28 PM IST