Nagababu Tweet About Pushpa 2: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 హవా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ కావటంతో ఈ సినిమాపై సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే డిసెంబర్ 5వ తేదీన అంటే రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈరోజు ప్రీమియర్ షోలు కూడా పడనున్నాయి. అయితే టిక్కెట్ల కాస్ట్ ఎక్కువగా ఉండటంతో ప్రీమియర్ షోలకు ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపటంలేదు. అల్లు అర్జున్ పుష్ప-1 తర్వాత వస్తోన్న మూవీ కావటంతో బన్నీ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.
ఇకపోతే ఈ మూవీ రిలీజ్‌కు ముందు మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేయటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ఎలక్షన్ల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి వెళ్లడంతో అప్పటినుంచి మెగా- అల్లు అభిమానుల మధ్య వైరం మొదలైంది. ఇదే విషయం చాలా సార్లు బయటపడింది. అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నాగబాబు కూడా పలు సార్లు ఇన్‌డైరెక్ట్‌గా ట్వీట్లలో తన అసహనాన్ని బయటపెట్టారు. తాజాగా అల్లు అర్జున్ పేరు ఎత్తకుండా, పుష్ప-2 సినిమా గురించి అని చెప్పకుండా ఆయన చేసిన ట్వీట్ (Nagababu Tweet About Pushpa 2) ఆసక్తికరంగా మారింది.
Also Read: New Honda Amaze: రూ. 8 లక్షలకు కొత్త హోండా అమేజ్.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు వచ్చిన ఫీచర్లు ఇవే!
24 క్రాఫ్ట్ ల కష్టంతో,
వందల మంది టెక్నీషన్ల శ్రమతో
వేల మందికి ఉపాధి కలిగించి,
కోట్ల మందిని అలరించేదే *సినిమా*ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…
అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని…
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 4, 2024
నాగబాబు ట్వీట్ ఇదే
నాగబాబు ట్వీట్‌లో ఏం చెప్పారంటే.. “24 క్రాఫ్ట్‌ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని, ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను.. 🙏” అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ పుష్ప-2 గురించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మెగా అభిమానులు కూడా సినిమాని ఆదరించాలని నాగబాబు కోరినట్లు ట్వీట్ చూస్తే అర్థమవుతోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్‌తో ‘పుష్ప-2’ వీక్షించనున్న అల్లు అర్జున్
‘పుష్ప-2’ సినిమాను తన అభిమానులతో చూసేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఆయన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు చేరుకుంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈరోజు రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్ షోలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా.. దీనికోసం నిర్వాహకులు సైతం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
విదేశాల్లో నేడే థియేటర్లలోకి ‘పుష్ప-2’
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ‘పుష్ప-2’ సినిమా నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 9.30 నుంచే ప్రీమియర్లు పడబోతున్నాయి. సోషల్ మీడియాతో పాటు బయట జనం మధ్యలో కూడా ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది.