Site icon HashtagU Telugu

Leo Movie : తెలుగులో లియో సినిమా వాయిదా.. కోర్టులో కేసు.. స్పందించిన తెలుగు డిస్ట్రిబ్యూటర్..

Naga Vamshi gives Clarity on Leo Release in Telugu

Naga Vamshi gives Clarity on Leo Release in Telugu

తమిళ్ స్టార్ హీరో విజయ్(Vijay) కి దసరా కానుకగా అక్టోబర్ 19న లియో(Leo) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలు సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు.

అయితే తెలుగులో ఈ సినిమా వాయిదా పడనుందని, కోర్టులో కేసు వేశారని పలు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత నాగవంశీ(Naga Vamsi) ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు.

నాగవంశీ మాట్లాడుతూ.. మేము నిర్మించిన వాతి(సార్) చిత్రాన్ని తమిళ్ లో లలిత్ కుమార్ గారు విడుదల చేశారు. ఆ సమయంలో ఏర్పడిన అనుబంధంతో ఇప్పుడు తెలుగులో ఆయన సినిమా లియోని మేము విడుదల చేస్తున్నాం. తెలుగులో టైటిల్ విషయంలో సమస్య వచ్చింది. ఆల్రెడీ తెలుగులో లియో టైటిల్ రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు.

అలాగే థియేటర్ల సమస్య గురించి మాట్లాడుతూ.. థియేటర్ల సమస్య లేదు. ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ సినిమా విడుదలవుతుంది. లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు ఎటువంటి సమస్య లేకుండా ఏ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఆ సినిమాకి కేటాయించారు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

అలాగే ఈ ఆదివారం లోపు హైదరాబాద్ లో లియో వేడుక నిర్వహించాలి అనుకుంటున్నాం. లోకేష్ కనగరాజ్, అనిరుధ్, త్రిష గారు ఈ ఈవెంట్ కి వస్తారు అని తెలిపారు.

 

Also Read : Renu Desai : అధ్య కోసమే మరో పెళ్లి చేసుకోలేదు – రేణు దేశాయ్