Site icon HashtagU Telugu

Naga Shaurya Marriage: బ్యాచిలర్ లైఫ్ కు నాగశౌర్య గుడ్ బై.. పెళ్లి డేట్ ఫిక్స్!

Naga Shaurya

Naga Shaurya

కృష్ణ బృందా విహారి చిత్రంతో ఆకట్టుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. త్వరలో ఈ హీరో బ్యాచిలర్ లైఫ్ కు ముగింపు పలుకనున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన నాగశౌర్య అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు.

పెళ్లి వేడుకలు పూర్తిగా బెంగళూరులో జరగనున్నాయి. ప్రస్తుతానికి అమ్మాయి వివరాలు గోప్యంగా ఉంచారు. నవంబర్ 20వ తేదీన బెంగళూరులోని JW మారియట్‌లో వివాహం జరగనుంది. ప్రస్తుతం నాగ శౌర్య SS అరుణాచలం దర్శకత్వంలో టైటిల్ పెట్టని సినిమాలో నటించబోతున్నాడు. మరికొన్ని సినిమాలకు సంబంధించిన కథ చర్చలు కొనసాగుతున్నాయి.