Site icon HashtagU Telugu

Tandel Director Planning Two Climax : ఆ సినిమాకు రెండు క్లైమాక్స్ లు సిద్ధం చేస్తున్నారట.. ఇదేం ట్విస్ట్ సామీ..!

AP Government Price hike for Naga Chatainya Thandel Movie

AP Government Price hike for Naga Chatainya Thandel Movie

Tandel Director Planning Two Climax అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమా లో ఒక పక్క దేశభక్తిని చూపిస్తూ మరోపక్క బుజ్జి తల్లి పాత్రలో సాయి పల్లవితో లవ్ ట్రాక్ కూడా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

అయితే ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి రెండు క్లైమాక్స్ లను రాసుకున్నారట. ఒకటి రెగ్యులర్ ఎండింగ్ కాగా మరొకటి సాడ్ ఎండింగ్ అని టాక్. అయితే సినిమా చివరి దశకు వచ్చాక సినిమాపై ఆడియన్స్ లో వస్తున్న రియాక్షన్ ని చూసి చిత్ర యూనిట్ ఒక క్లైమాక్స్ కు ఫిక్స్ అవుతుందట.

సో సినిమాకు ఆ రెండు క్లైమాక్స్ లు వర్తించేలానే షూట్ చేస్తున్నారట. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి తండేల్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం కూడా మరో హైలెట్ అంటున్నారు. సినిమా రష్ చూస్తే సినిమా అనుకున్న దాని కన్నా బాగా వస్తుందని చెబుతున్నారు.

Also Read : Hanuman Record TRP : బుల్లితెర మీద అదరగొట్టిన హనుమాన్.. స్టార్స్ ని వెనక్కి నెట్టేసిన తేజా సజ్జ..!