Naga Chaitanya Shobhita : అక్కినేని ఇంటి కోడలు అవుతున్న శోభిత..!

మా ఫ్యామిలీలోకి శోభితను ఆహ్వానిస్తున్నాం అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి చైతు, శోభిత ఇద్దరు ప్రేమతో కలకాలం సంతోషంగా ఉండాలని మెసేజ్ పెట్టారు.

Published By: HashtagU Telugu Desk
Akkineni Compound Cleared the Rumors about Naga Chaitanya Shobhita Marriage Netflix Deal

Akkineni Compound Cleared the Rumors about Naga Chaitanya Shobhita Marriage Netflix Deal

అక్కినేని నాగ చైతన్య కొన్నాళ్లుగా శోభిత దూళిపాల తో రిలేషన్ లో ఉన్నాడని. వాళ్లిద్దరి మధ్య సంథింగ్ ఏదో జరుగుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఐతే వాటి గురించి ఆ ఇద్దరు ఎక్కడ ప్రస్తావించలేదు. తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్న వీరి గురించి నిన్న నైట్ నుంచి ఎంగేజ్మెంట్ కి సిద్ధమని వార్తలు వచ్చాయి. ఐతే ఈరోజు సోషల్ మీడియా మొత్తం చైతన్య, శోభితల న్యూస్ హై9లెట్ అయ్యింది.

నాగ చైతన్య (Naga Chaitanya) శోభిత ఎంగేజ్మెంట్ అంటూ వార్తలు వచ్చాయి. ఐతే వాటిని నిజం చేస్తూ లేటెస్ట్ గా నాగార్జున (Nagarjuna) తన ట్విట్టర్ ఖాతాలో మా ఫ్యామిలీలోకి శోభితను ఆహ్వానిస్తున్నాం అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి చైతు, శోభిత ఇద్దరు ప్రేమతో కలకాలం సంతోషంగా ఉండాలని మెసేజ్ పెట్టారు. నాగ చైతన్య, శోభిత (Shobhita) ఇద్దరు కలిసి నటించింది లేదు కానీ వాళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది.

ముఖ్యంగా ఇద్దరు ఫారిన్ లో కలిసి తిరిగే వారన్న టాక్ అయితే ఉంది. కొన్నాళ్లుగా గాలి వార్తగా ఉన్న ఈ న్యూస్ ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ వారి రిలేషన్ షిప్ ని ఎంగేజ్మెంట్ తో స్ట్రాంగ్ చేసుకున్నారు. కచ్చితంగా ఈ న్యూస్ ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ కి చేదు వార్తే. అంతకుముందు స్టార్ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య ఆమెకు డైవర్స్ ఇచ్చి ఇప్పుడు శోభిత ను పెళ్లాడబోతున్నాడు. అడివి శేష్ గూఢచారి, మేజర్ సినిమాల్లో నటించిన శోభిత పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ సినిమా చేస్తున్నాడు. చైతు కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఆ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Samantha : సమంత కెరీర్ లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్..!

  Last Updated: 08 Aug 2024, 04:50 PM IST