Site icon HashtagU Telugu

Naga Chaitanya : బుట్టబొమ్మ తో చైతు..ఈసారి ఏమవుతుందో..?

Chaitu Pooja

Chaitu Pooja

నాగ చైతన్య (Naga Chaitanya)- పూజా హగ్దే (Pooja Hegde) మరోసారి జత కట్టబోతున్నారు. వీరిద్దరూ కలిసి పదేళ్ల క్రితం ఓక లైలా కోసం మూవీ చేసారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి జతకట్టబోతున్నారని తెలిసి అభిమానులు ఈసారి ఏమవుతుందో అని ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రస్తుతం చైతు , పూజా కెరియర్ ఏమాత్రం బాగాలేదు. వరుస ప్లాప్స్ ఇద్దర్ని ఇబ్బంది పెడుతున్నాయి. నాగ చైతన్య హిట్ చూసి చాల కాలమే అవుతుంది. ప్రస్తుతం చైతు ఆశలన్నీ తండేల్ (Thandel) పైనే పెట్టుకున్నాడు. చందూ మొండేటి డైరెక్షన్లో , గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ తాలూకా టీజర్ సినిమా ఫై ఆసక్తి , అంచనాలు పెంచాయి. అంతే కాకుండా ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండడం, దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండడం తో ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పూజా విషయానికి వస్తే వరుస ప్లాప్స్ ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో చైతు , పూజా కలిసి మరోసారి నటించేందుకు సిద్ధమయ్యారు. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో చైతూ సరసన హీరోయిన్ గా పూజా హెగ్దేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘భం భోలేనాథ్’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కార్తీక్ దండు.. ‘విరూపాక్ష’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సాయి దుర్గ తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. గతేడాది సమ్మర్ లో పాన్ ఇండియా వైడ్ గా రిలీజైన ఈ మిస్టిక్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో టాలెంటెడ్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ తరుణంలో తన తదుపరి చిత్రాన్ని యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో చేయబోతున్నట్లుగా ప్రకటించేసారు. కార్తీక్ దండు చెప్పిన స్టోరీ నాగచైతన్యకు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది ఏ జోనర్ లో ఉంటుందనే తెలియదు కానీ, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్ లో తెరకెక్కుతుంది.

Read Also : Asaduddin Owaisi : పాలకులు ఫారోలుగా మారితే మోసెస్ వస్తాడు : ఒవైసీ