అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya ready to second marriage)..రెండో వివాహానికి సిద్దమయ్యాడా..? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ (Film Nagar)వర్గాలు. ఏమాయ చేసావే అంటూ సమంత (Samantha) ను మాయ చేసిన చైతు..ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకొని..పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటను చూసి చాలామంది కుల్లుకున్నారు కూడా..ఆలా ఇద్దరు నాలుగేళ్లపాటు పెళ్లి బంధంలో మునిగితేలారు. ఆ తర్వాత ఏర్పడిన విభేదాలతో ఇద్దరు ఇష్టపూర్తిగా కోర్ట్ సమక్షంలో విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యారు. చైతు బాగానే ఉన్నప్పటికీ..సమంత మాత్రం అనారోగ్యం బారినపడి చావు అంచుల వరకు వెళ్లి క్షేమంగా బయటపడింది. ప్రస్తుతం సినిమాలు చేయడం తగ్గించి ఆరోగ్యం ఫై శ్రద్ద పెట్టింది.
ఇక చైతు విషయానికి వస్తే వరుస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇతడే కాదు నాగ్ ఫామిలీ మొత్తం కూడా హిట్ లేక బాధపడుతున్నారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం చైతు కు రెండో వివాహం చేయాలనీ నాగ్ (Nagarjuna) ఫిక్స్ అయ్యాడట. ఈసారి ఇండస్ట్రీ అమ్మాయిని కాకుండా బిజినెస్ రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ఫిక్స్ చేసాడట. ఈ పెళ్లికి చైతు సైతం ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాట ముచ్చట కూడా పూర్తి అయినట్లు చెపుతున్నారు. అయితే, దీనిపై అక్కినేటి కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. ఇందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియాల్సి ఉంది.
Read Also: Tollywood : తెలుగు హీరోలను చూస్తే సిగ్గేస్తుంది -జేసీ సంచలన వ్యాఖ్యలు
ఆ మధ్య నాగ చైతన్య నటి శోభిత (Sobhita Dhulipala)తో ప్రేమలో పడినట్లు ..ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటు మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ వార్తలను శోభిత ధూళిపాళ కొట్టిపారేసింది. “ప్రస్తుతం నాకు మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. జీవితంలో ఎన్నో మంచి అనుభూతులను వదిలేసి ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటి గురించి ఆలోచిస్తూ బాధపడే తీరికనాకు లేదు. నా గురించి వస్తున్న రూమర్స్ కు నాకు సంబంధం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా పని నేను శ్రద్ధతో చేసుకుంటూ వెళ్తాను” అని వెల్లడించింది. సో మొత్తం మీద చైతు రెండో పెళ్లికి సిద్దమయ్యాడనే వార్త ఆయన అభిమానుల్లో సంతోషం నింపుతుంది.