Site icon HashtagU Telugu

Naga Chaitanya : నాగ చైతన్య నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఫిక్స్..!

Naga Chaitanya Next Movie Director Fix

Naga Chaitanya Next Movie Director Fix

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాస్తు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య డీ గ్లామర్ లుక్ తో కనిపిస్తున్నారు. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా హిట్ అందుకున్న చందు మొండేటి నాగ చైతన్య తండేల్ తో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య తన నెక్స్ట్ డైరెక్టర్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. భం భం బోలేనాథ్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కార్తీక్ ఆ తర్వాత సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ వచ్చాడు.

విరూపాక్ష సినిమా తో డైరెక్టర్ గా తన సెకండ్ అటెంప్ట్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. అసలైతే విరూపాక్ష సీక్వెల్ ప్లాన్ చేస్తాడని అనుకోగా దాన్ని పక్కన పెట్టి నాగ చైతన్యతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. తండేల్ తర్వాత చైతు చేయబోయే ఈ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.

Also Read : Prabhas Kalki OTT Rights : కల్కి ఎక్కడ తగ్గట్లేదు.. ఓటీటీ రైట్స్ మైండ్ బ్లాక్ అయ్యే డీల్..!