‘కుబేర’ (Kuberaa) సినిమాలో రష్మిక నటన చూస్తే ‘క్షణక్షణం’లో శ్రీదేవి గుర్తొచ్చారని హీరో నాగార్జున అన్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ , నాగార్జున , రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కుబేరా మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయం సాధించింది. ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా విజయం సాధించడం పట్ల చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఆదివారం సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగా స్టార్ చిరంజీవి హాజరయ్యారు.
Health : హాట్ చిప్స్ అధికంగా తింటున్నారా? మీ గుండెకు ముప్పు పొంచి ఉన్నట్లే!
ఈ సందర్భంగా నటుడు నాగార్జున, హీరోయిన్ రష్మిక మందన్నా నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్మికను చూసినప్పుడు తనకు ‘క్షణక్షణం’లో శ్రీదేవి నటన గుర్తొచ్చిందని అన్నారు. ఆమె నేషనల్ క్రష్ మాత్రమే కాకుండా ఇకపై తన క్రష్ కూడా అని నవ్వుతూ పేర్కొన్నారు. ఈ సినిమాలో తన పాత్రకు మంచి స్పందన రావడంతో, ఇకపై ఏ పాత్రలు చేయాలన్న స్పష్టత వచ్చిందని చెప్పారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి ధనుష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘కుబేరా’లో దేవా పాత్రకు ధనుష్ ప్రాణం పోసినట్లు అభిప్రాయపడ్డారు. “ఈ పాత్రను ధనుష్ తప్ప మరెవ్వరూ చేయలేరు. నేనూ చేయలేను. ఆయన నటన చాలా సహజంగా ఉంది. ఈ సినిమాలో ఆయనకు నేషనల్ అవార్డు రాలేదంటే, ఆ అవార్డులకి అర్థం ఉండదు” అని వ్యాఖ్యానించారు. చిరంజీవి మాటలు అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Angry Rishabh Pant: టీమిండియా- ఇంగ్లాండ్ టెస్ట్.. అంపైర్‌పై రిషబ్ పంత్ ఫైర్!
సినిమా విడుదలైన రోజునుంచి మంచి టాక్ రావడం, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తుండటంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ధనుష్, రష్మిక, నాగార్జున, శర్వానంద్‌ల నటన, టెక్నికల్ వర్క్, కథా నిర్మాణం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని హిట్ చేశాయని దర్శకుడు తెలిపారు. ‘కుబేరా’ సినిమాను చూసిన ప్రేక్షకుల స్పందన చాలా మోటివేషన్ ఇచ్చిందని టీమ్ తెలిపింది.