Site icon HashtagU Telugu

Naatu Naatu Performance: నాటు నాటు పాటతో దుమ్మురేపిన రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ

Natu Natu

Natu Natu

ఆస్కార్ (Oscar) నామినేట్ కు ముందే ఆర్ఆర్ఆర్ (RRR) లోని నాటు నాటు సాంగ్ దుమ్మురేపింది. ఇక ఆస్కార్ వేదిక పై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉందని అందరికి తెలిసిన విషయమే. నేడు ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన స్టేజి పై తమ పర్ఫామెన్స్ ఇచ్చారు రాహుల్ అండ్ కాలభైరవ. వీరిద్దరూ పాట పడుతుండగా.. అమెరికన్ డాన్సర్స్ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే నాటు నాటు (Naatu Naatu) సాంగ్ మొత్తం పడలేదు.

పాటలోని పల్లవి, రెండో చరణం పాడి పాటను ముగించేశారు. ఇక ఈ పాటకు ముందు ఇతర సాంగ్స్ కూడా పాడారు. వాటికీ కేవలం చప్పట్లు కొట్టి ఉరుకున్న ప్రేక్షకులు.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన నాటు నాటు సాంగ్ కి మాత్రం వేడుకలో అతిథులు అంత నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియోని RRR టీం తమ ట్విట్టర్ ద్వారా షేర్ చేయగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఇదే స్టేజి పై ఆస్కార్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది.

Also Read: Mohammed Siraj: ఆస్ట్రేలియన్స్ నన్ను ‘బ్లాక్ మంకీ’ అని దూషించారు: మహ్మద్ సిరాజ్